Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఒకవైపు పాలనతో పాటు మరోవైపు సంక్షేమంపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను సైతం భర్తీ చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిసిసిబి, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు డీసీఎంఎస్ లకు చైర్మన్ లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో డిసిసిబిలతో పాటు డిసిఎంఎస్ అధ్యక్షులను నియమించింది. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జనసేనకు సైతం చోటు దక్కడం విశేషం. జిల్లాస్థాయి కార్యవర్గాలను మాత్రమే ప్రకటించింది. ఇంకా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు అధ్యక్షులను నియమించలేదు.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* డిసిసిబి చైర్మన్లు వీరే.. శ్రీకాకుళం( Srikakulam ) డిసిసిబి చైర్మన్ గా శివ్వాల సూర్యనారాయణ ( టిడిపి), విశాఖ డిసిసిబి చైర్మన్ గా కోన తాతారావు ( జనసేన), విజయనగరం డిసిసిబి చైర్మన్ గా కిమిడి నాగార్జున (టిడిపి), గుంటూరు డిసిసిబి చైర్మన్ గా మక్కెన మల్లికార్జున రావు ( టిడిపి ), కృష్ణా డిసిసిబి చైర్మన్ గా నెట్టెం రఘురాం ( టిడిపి ), నెల్లూరు డిసిసిబి చైర్మన్ గా ధనుంజయ రెడ్డి ( టిడిపి), చిత్తూరు డిసిసిబి చైర్మన్ గా అమాస రాజశేఖర్ రెడ్డి ( టిడిపి), అనంతపురం డిసిసిబి చైర్మన్ గా కేశవరెడ్డి ( టిడిపి ), కర్నూలు డిసిసిబి చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి ( టిడిపి), కడప డిసిసిబి చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి ( టిడిపి) తదితరులకు అవకాశం ఇచ్చారు.
* డీసీఎంఎస్ చైర్మన్లు వీరే..
డీసీఎంఎస్ చైర్మన్లుగా( dcms chairmans ) శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చౌదరి అవినాష్ ( టిడిపి), విశాఖకు కోటిని బాలాజీ ( టిడిపి ), గుంటూరుకు వడ్రాణం హరిబాబు ( టిడిపి ), కృష్ణా జిల్లాకు బండి రామకృష్ణ ( జనసేన), నెల్లూరుకు గునుగోడు నాగేశ్వరరావు ( టిడిపి ), చిత్తూరుకు సుబ్రహ్మణ్యం నాయుడు ( టిడిపి), అనంతపురానికి నెట్టెం వెంకటేశ్వర్లు ( టిడిపి), కర్నూలుకు నాగేశ్వర యాదవ్ ( టిడిపి), కడప జిల్లాకు ఎర్రగుంట్ల జయప్రకాష్ ( టిడిపి ) లకు అవకాశం ఇచ్చారు.
* ఆ రెండు జిల్లాలు తప్పించి..
అయితే కీలకమైన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి లకు సంబంధించి డిసిసిబి అధ్యక్షులను నియమించలేదు. అయితే అక్కడ జనసేన బలమైన శక్తిగా ఉంది. ఆ రెండు జిల్లాల డీసీసీబీలతో పాటు డీసీఎంఎస్ పోస్టులను జనసేన ఆశిస్తోంది. అందుకే అక్కడ పదవుల ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘాలకు అధ్యక్షులు నియామకం కూడా జరగనుంది. ఇప్పటికే ఈ జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. త్వరలో ప్రత్యేక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో ఈశాన్య రాష్ట్రాల బస్సులు.. రూ.82.14 కోట్లకు టెండర్!