Homeఆంధ్రప్రదేశ్‌AP constituency increase: నియోజకవర్గాల పెంపు.. ఏపీలో ఎవరికి లాభం?!

AP constituency increase: నియోజకవర్గాల పెంపు.. ఏపీలో ఎవరికి లాభం?!

AP constituency increase: ఏపీలో( Andhra Pradesh) అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలను 50% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన ఏపీలో ఓ 88 అసెంబ్లీ సీట్లు.. 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరగనున్నాయి. ఇదే జరిగితే కూటమికి ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు.. కూటమి గెలిచిన తర్వాత చాలామంది వైసిపి నేతలు అటువైపు నుంచి వచ్చారు. పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. అటువంటి వారికి ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ఒక వరంగానే చెప్పవచ్చు. దాదాపు ఓ 100 మంది నేతలకు కూటమి నుంచి సర్దుబాటు చేయవచ్చు. పైగా ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో నియోజకవర్గాల పునర్విభజన అనుకూలంగా మార్చుకోవచ్చు అనే టాక్ ఉంది.

అప్పుడు అధికార పార్టీకి లాభం..
2009లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. జాతీయస్థాయిలో యూపీఏ( United progress Alliance ) రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించేందుకు అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన అక్కరకు వచ్చింది. అప్పట్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేది. టిడిపికి చెందిన బలమైన నియోజకవర్గాలను పునర్విభజనలో భాగంగా విభజించారు. బలమైన మండలాలను విడగొట్టి వేర్వేరు నియోజకవర్గాల్లో కలిపారు. ఇప్పుడు కూడా కూటమి అదే పని తప్పకుండా చేస్తుంది అనేది విశ్లేషకుల మాట. వైసీపీకి బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని విభజిస్తుంది. కచ్చితంగా అదికూటమికి ప్లస్ గా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.

Also Read: నియోజకవర్గాల పునర్విభజన.. ఏపీలో మహిళల నియోజకవర్గాలు ఇవే!

రాజకీయ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
ఏకంగా అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ స్థానాలు 100 వరకు పెరుగుతాయంటే రాజకీయ నిరుద్యోగులకు ఇది శుభవార్త. దాదాపు ఉమ్మడి జిల్లాల నుంచి ఐదు నుంచి ఆరు అసెంబ్లీ సీట్లు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అంటే ప్రతి జిల్లాలో ఒక ఐదుగురు ఆశవహులకు కొత్తగా అవకాశం ఇవ్వచ్చన్నమాట. మరోవైపు బలమైన నేతలను పార్లమెంటు స్థానాలకు కూడా పంపించవచ్చు. 38 వరకు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయంటే ఆ స్థాయిలో నేతలకు అవకాశాలు దక్కినట్టే. కూటమి పార్టీలో చాలామంది వైసీపీ నేతలు చేరారు. వారంతా తమ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే ఆశాభావంతో ఉండేది. కూటమిలోకి వెళ్లిన నేతలు అంతా తిరిగి వస్తారని భావించింది. కానీ ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండడంతో కూటమిలో చేరిన నేతలు అంతా అక్కడే ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పెంపు అనేది అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చుతుందని విశ్లేషకుల మాట.

వారందరికీ ఇప్పుడు చాన్స్..
ఎన్నికలకు ముందు, తరువాత చాలామంది వైసిపి నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీల్లో చేరారు. అయితే ఇందులో చాలామందికి అవకాశం లేకుండా పోయింది. కానీ అప్పట్లో చంద్రబాబు హామీ మేరకు మాత్రమే వీరంతా చేరారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఉంది. అందుకే వైసిపి నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చేర్చుకున్నారు. పార్టీ టిక్కెట్లు ఇస్తామని.. నియోజకవర్గాల పెంపు ఉంటుందని వారికి చెప్పి చేర్చుకున్నారని ఇప్పుడు అర్థమవుతోంది. మరోవైపు పెరిగిన నియోజకవర్గాలతో పొత్తులో భాగంగా జనసేనతో పాటు బిజెపికి కూడా ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. తద్వారా కూటమిలో ఐక్యత పెరుగుతుంది. కచ్చితంగా నియోజకవర్గాల పెంపు అనేది కూటమికి ప్రయోజనం అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper