Homeఆంధ్రప్రదేశ్‌AP constituency delimitation: నియోజకవర్గాల పునర్విభజన.. వందలాది పదవులు

AP constituency delimitation: నియోజకవర్గాల పునర్విభజన.. వందలాది పదవులు

AP constituency delimitation: రాజకీయం చేయాలంటే అవకాశాలు దక్కాలి. అవకాశాలు దక్కాలంటే రాజకీయం చేయాలి. అయితే ఉన్న పదవుల తక్కువ.. నేతలు ఎక్కువ అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనతో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లు మాత్రమే కాదు వందలాది పదవులు పుట్టుకొస్తాయి. వందలాదిమంది కొత్త ముఖాలు రాజకీయాల వైపు వస్తాయి. ఆర్థికంగా ఉన్నవారు.. పారిశ్రామికవేత్తలు ఇలా అందరూ రాజకీయాల వైపు రావడం ఖాయం. ఎందుకంటే గత 20 ఏళ్లుగా అదే జరుగుతోంది. ఇప్పుడు […]

AP constituency delimitation: రాజకీయం చేయాలంటే అవకాశాలు దక్కాలి. అవకాశాలు దక్కాలంటే రాజకీయం చేయాలి. అయితే ఉన్న పదవుల తక్కువ.. నేతలు ఎక్కువ అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజనతో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లు మాత్రమే కాదు వందలాది పదవులు పుట్టుకొస్తాయి. వందలాదిమంది కొత్త ముఖాలు రాజకీయాల వైపు వస్తాయి. ఆర్థికంగా ఉన్నవారు.. పారిశ్రామికవేత్తలు ఇలా అందరూ రాజకీయాల వైపు రావడం ఖాయం. ఎందుకంటే గత 20 ఏళ్లుగా అదే జరుగుతోంది. ఇప్పుడు ఈ పదవుల పెంపుతో సైతం అదే జరగనుంది.

ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు మాత్రమే కాదు..
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పునర్విభజనతో మరో 80 సీట్లు పెరుగుతాయి. పార్లమెంట్ స్థానాలు 25 ఉన్నాయి. మరో 13 వరకు పెరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఎమ్మెల్సీలు ఏపీ నుంచి 52 మంది దాకా ఉండేవారు. వాటి సంఖ్య మరో 25 పెరగనున్నాయన్నమాట. రాజ్యసభ సీట్లు 11 ఉండేవి. అవి ఐదు నుంచి 6 వరకు పెరుగుతాయి. అయితే కేవలం నియోజకవర్గాల పునర్విభజన మాత్రమే కాదు. మున్సిపాలిటీలతో పాటు మండలాలు, పంచాయితీలు కూడా పెరుగుతాయి. అంటే టోటల్ గా వందలాది పదవులు లభించునున్నాయి కొత్తవారికి. అయితే ఇది కొత్తగా ఆశావహులకు చక్కటి అవకాశం కూడా.

ఆర్థిక స్థితిమంతులకే..
గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చాలామంది నేతలు పార్టీల్లో చేరేవారు. పార్టీల్లో సేవలు అందించేవారు. వారి సేవలను గుర్తించి పదవులు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆర్థికంగా బలమైన వారికి అవకాశాలు దక్కుతున్నాయి. పార్టీ కోసం పని చేసే వారికి చాలా తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. రాజకీయం డబ్బుమయంగా మారడంతో నిజమైన రాజకీయాలు చేసే వారు కూడా పక్కకు తప్పుకుంటున్నారు. కేవలం డబ్బుతో రాజకీయం చేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏపీలో పదవులు పెరగడంతో కొత్తవారికి అవకాశం కలుగుతుంది. చాలామంది నేతలు ఇప్పటినుంచే తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. నియోజకవర్గస్థాయి నేతలుగా మారుతున్నారు. పునర్విభజనతో పెరగనున్న పదవులతో కొత్తవారికి చాలా అవకాశాలు పుష్కలం.. అయితే అందులో సద్వినియోగం చేసుకునేది కొందరే. ఎందుకంటే అందరికీ అవకాశాలు రావు కూడా. అయితే అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మాత్రం రాజకీయాల్లో రాణించడం చాలా సులువు. అయితే ఇప్పటివరకు రాజకీయాల్లో రాణించిన వారు ఒక ఎత్తు అయితే.. పునర్విభజనతో మరికొంతమంది తెరపైకి వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper