AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లాసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఒంగోలులోని రైజ్ ఇన్ స్టిట్యూట్ కు ఆయన పరీక్ష రాసేందుకు వచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధిపులకు గురయ్యారు. ఆ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అనేక తప్పుడు అభియోగాలు, అక్రమ సస్పెన్షన్లు ఎదుర్కొన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరణమణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్ల సస్పెన్షన్ కాలవ్యవధి మొత్తన్ని క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.