The Paradise : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక ప్రతి హీరో టార్గెట్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడమే కావడంతో ప్రతి ఒక్క హీరో మంచి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…
న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని(Nani)… అష్టచమ్మా (Ashta Achamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని (Nani) మొదట్లో సాఫ్ట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక మధ్యలో కామెడీ సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దసర (Dasara) సినిమాతో మాస్ హీరోగా మారిపోవడమే కాకుండా ఇప్పటివరకు వరుసగా అలాంటి సినిమాలనే చేసే ప్రయత్నమైతే చేస్తున్నాడు. అందులో భాగంగానే ‘ది పారడైజ్’ (The Paradise) పేరుతో మరో మాస్ సినిమా చేస్తున్నాడు. దసర సినిమాని తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడం విశేషం. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.
గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండడమే కాకుండా అటు నానికి ఇటు శ్రీకాంత్ ఓదెలకి ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకురాబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడిని నమ్మి నాని దసర సినిమాతో మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి ప్యారడైజ్ సినిమా కోసం అతనికి మంచి అవకాశం అయితే అందించాడు.
మరి ఇదే ధోరణిలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందా? లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనేది ఈ గ్లిమ్స్ ద్వారా మనకు పరిచయం చేశారు. ఇక తన లుక్ లో కూడా చాలా వరకు వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో నాని తల్లిగా ఒక స్టార్ హీరోయిన్ నటించబోతుందనేది కూడా తెలుస్తోంది.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రమ్యకృష్ణ నానికి తల్లిగా నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక గ్లిమ్స్ లో తన తల్లి వాయిస్ ఓవర్ తోనే నాని ఇంట్రడక్షన్ అయితే సాగింది. ఒక పవర్ ఫుల్ కొడుకుగా నాని నటించబోతున్నాడు. మరి ఆ పవర్ ఫుల్ పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తూ ఉండడం ఈ సినిమాకి మరింత హైప్ ని తీసుకురావడమే కాకుండా ఆ క్యారెక్టర్ల తాలూకు రాజసాన్ని కూడా ఎక్కడ పడిపోకుండా నిలబెట్టగలిగే కెపాసిటి ఉన్న రమ్యకృష్ణ (Ramya krishna) ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : జడ వేసి.. హీరో నానినే చూపించలేదే.. ‘ప్యారడైజ్’లో శ్రీకాంత్ ఓదెల స్ట్రాటజీ ఏంటి.?