https://oktelugu.com/

Ambati Rambabu: అంబటికి చుక్కలు చూపించిన విలేకరి

ఓసారి ఓ ప్రెస్ మీట్ లో విలేకరి అంబటి నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించి కీలకమైన ప్రశ్న అడిగారు. సమాధానం చెప్పేందుకు ఉక్కిరి బిక్కిరి అయిన అంబటి సదరు విలేకరిని బయటకు వెళ్ళమనడం అప్పట్లో వివాదంగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : April 17, 2024 / 11:28 AM IST

    Ambati Rambabu

    Follow us on

    Ambati Rambabu: అంబటి రాంబాబు గురించి తెలియని వారు ఉండరు.. అయితే అతను ఏదో మంచి పనులు చేసి సుపరిచితం కాదు. వివాదాస్పదుడిగానే ప్రజలు గుర్తించగలిగారు. ఇక ఆయనకు సంబంధించి మీడియాలో ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఓ మహిళతో సరస సంభాషణలకు సంబంధించి ఆడియో తెలుగు నాట బహుళ ప్రాచుర్యం పొందింది. రాజకీయంగా కూడా తరచూ ఆయన చేసే వ్యాఖ్యలు, వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. మీడియా మీద రంకెలు వేయడం చాలా సందర్భాల్లో చూశాం. అయితే ఇప్పుడు అదే మీడియా సమావేశంలో ఓ విలేకరి అంబటి రాంబాబుకు చుక్కలు చూపించారు. దీంతో ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది.

    ఓసారి ఓ ప్రెస్ మీట్ లో విలేకరి అంబటి నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించి కీలకమైన ప్రశ్న అడిగారు. సమాధానం చెప్పేందుకు ఉక్కిరి బిక్కిరి అయిన అంబటి సదరు విలేకరిని బయటకు వెళ్ళమనడం అప్పట్లో వివాదంగా మారింది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో కీలక డిబేట్లో అంబటి పాల్గొంటున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన మీడియా చర్చ గోష్టిలోఅంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియో లీక్స్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. కానీ అంబటి రాంబాబు సమాధానాలు దాటవేస్తూ వచ్చారు.

    అయితే తాజాగా జగన్ పై గులకరాయి దాడి విషయం ప్రస్తావన వచ్చేసరికి అంబటి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. అప్పుడే ఓ విలేఖరి ఎంటర్ అయ్యారు. గతంలో చంద్రబాబు మీద రాళ్ల దాడులు జరిగినప్పుడు మీరు దీనికి భిన్నంగా ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. అయితే అసలు తాను ఎప్పుడూ చంద్రబాబు మీద రాళ్లదాడి గురించి మాట్లాడలేదని తేల్చి చెప్పారు. వెంటనే విలేఖరి తన ఫోన్లో ఉన్న యూట్యూబ్లో.. నాడు అంబటి చేసిన వ్యాఖ్యలను చూపించారు. ఆ వీడియోలు ఎవరో అసంతృప్తులు ఒక రాయి విసిరితే దానిమీద ఇంత రాద్ధాంతం చేస్తారా అంటూ అప్పట్లో ఇదే అంబటి దబాయించారు. దీంతో ఒక్కసారిగా అంబటి నీళ్లు నమిలారు. తనలో తానే సర్దుకున్నారు. ఇటీవల చంద్రబాబుపై రాళ్లదాడి గురించి అనుకున్నానని సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడున్న విలేకరులు నవ్వుకోవడం కనిపించింది.