Homeక్రీడలుక్రికెట్‌David Miller: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు

David Miller: డేవిడ్ మిల్లర్.. అప్పుడు.. ఇప్పుడు.. నష్ట జాతకుడు

David Miller: డేవిడ్ మిల్లర్.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.. వాస్తవానికి డేవిడ్ మిల్లర్. అద్భుతమైన క్రికెటర్. దక్షిణాఫ్రికా జట్టులో ప్రతిభావంతమైన ఆటగాడు. వేగంగా పగులు తీయగలడు. దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు. పిచ్ సంబంధం లేకుండా ఆడగలడు. బౌలర్ ఎవరనేది చూడకుండా వీరోచితంగా ప్రదర్శన చేయగలడు.

మిల్లర్ ఉన్నాడు అంటే విధ్వంసం కచ్చితంగా జరుగుతుందని అంటారు . అతడు ఆడిన ఆట.. చేసిన పరుగులు అలాంటి నానుడి పుట్టే విధంగా చేశాయి. అటువంటి మిల్లర్ 2024 లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో అవుట్ కావడం దక్షిణాఫ్రికా జట్టుకు జీవితకాల బాధను కలిగించింది. జట్టు గెలుస్తుందనుకుంటున్న తరుణంలో మిల్లర్ అవుట్ కావడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. మిల్లర్ అవుట్ కావడం అప్పట్లో విస్తృతమైన చర్చకు దారి తీసింది. మిల్లర్ ఔట్ అయిన తర్వాత.. పెవిలియన్ వెళ్తున్నప్పుడు కన్నీటి పర్యంతమయ్యాడు.. తట్టుకోలేక తలవంచుకున్నాడు.

సేమ్ అలాంటి సన్నివేశం బుధవారం నాటి మ్యాచ్లో చోటుచేసుకుంది. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్.. ముందుగా గాయపడ్డాడు.. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి వచ్చాడు. సిరాజు ఓవర్లో విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో విజయానికి రెండు పరుగులు అవసరమైన సందర్భంలో.. ఒక పరుగు తీసే అవకాశం వచ్చినప్పటికీ.. వదులుకున్నాడు. అలా అతడు చూపించిన అతి విశ్వాసం ఢిల్లీ జట్టు కొంపముంచింది. ఫలితంగా ఒక పరుగు తేడాతో ఢిల్లీ జట్టు ఓడిపోవలసి వచ్చింది.

ఢిల్లీ జట్టు ఓటమి తర్వాత మిల్లర్ మీద విమర్శలు పెరిగిపోతున్నాయి. ఆ ఒక్క పరుగు తీసి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని.. అతి విశ్వాసానికి వెళ్లి మిల్లర్ పరువు తీసుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.. ” మిల్లర్ ముమ్మాటికి నష్ట జాతకుడు. అనవసరంగా వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నాడు. అతడు గనుక ఆ పరుగు తీసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. చివరి బంతికి బై రూపంలో ఒక పరుగు వచ్చినా సరే ఢిల్లీ జట్టు గెలిచేదని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆవేదనతో తల పట్టుకున్నాడు. ఆ సమయంలో ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ అతడిని అనునయించాడు.” నీ పని నువ్వు చేసావ్.. ఈసారి అదృష్టం మన వైపు లేదు. నీ ప్రయత్నంలో లోపం లేదు. నూటికి నూరు శాతం నీ ఎఫర్ట్ చూపించావని” అక్షర్ అతడిని ఓదార్చాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version