Amaravati Tirumala Temple: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. గతంలో నిలిచిపోయిన చాలా రకాల ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభించింది. అందులో భాగంగా అమరావతిలో తిరుమల నమూనా ఆలయాన్ని నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణానది కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించాలన్నది ఆలోచన. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి 2018లో ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణ పనులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు సైతం నిలిచిపోయాయి. అయితే అప్పట్లో రూ.36 కోట్లకు అంచనా వ్యయాన్ని పరిమితం చేసి.. ప్రధాన ఆలయంతో పాటు లోపలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపాలు మాత్రం నిర్మించి మమ అనిపించేశారు.
Also Read: కుప్పంలో సౌత్ కొరియా పరిశ్రమ కోసం చంద్రబాబు బిగ్ స్టెప్
దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం
కూటమి( Alliance ) అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఈ క్షేత్ర వైభవాన్ని మరింత చాటి చెప్పేందుకు నిర్ణయం తీసుకుంది. ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన మొక్క ద్వారా వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితోపాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతి లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 185 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. టీటీడీతోపాటు ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతిలో తిరుమల ఆలయ నిర్మాణం జరగనుంది.
Also Read: అంబటి రాంబాబు డాన్స్ కు ఫిదా అయిన ఆ నటుడు!
వెలుపలి ప్రాకారానికి తూర్పు దిక్కున మహారాజా గోపురం, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో రాజ గోపురాలు ఉంటాయి. వాటితో పాటు కళ్యాణోత్సవ, ఉత్సవ మండపాలను సైతం నిర్మిస్తారు. ఇందుకుగాను 84 కోట్లు కేటాయించారు. విద్యుత్ సబ్స్టేషన్, సోలార్ లైటింగ్ విధానం, సోలార్ పవర్ ప్లాంట్ ల కోసం 11 కోట్లు కేటాయించారు. అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, భక్తులు వేచి ఉండే హాల్ వంటి నిర్మాణాల కోసం 20 కోట్లు కేటాయించారు. ఆలయానికి చుట్టూ మాడవీధులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 6 కోట్లు కేటాయించారు. పుష్కరిణితోపాటు ఆంజనేయ స్వామి ఆలయం, రాధా మండపం వంటి నిర్మాణాలకు మరో 44 కోట్లు కేటాయించారు