Amaravati capital project update: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి అన్ని విధాల అండగా నిలుస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏకంగా వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు సాయం ప్రకటించింది. గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్ధతుల ద్వారా అమరావతికి నిధుల సమీకరణ పూర్తి చేయగలిగింది. కేంద్ర ప్రభుత్వం సైతం కీలక ప్రాజెక్టులను అమరావతికి కేటాయించింది. ముఖ్యంగా ప్రత్యేక రైల్వే లైన్లతోపాటు జాతీయ రహదారుల అనుసంధానం వంటి వాటి విషయంలో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పెండింగ్ ప్రాజెక్టులు సైతం
తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం( central government) గుడ్ న్యూస్ చెప్పింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఎందుకు సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు.
Also Read: Amaravati Re Launch : మూడేళ్లలో అమరావతి.. ఆంధ్ర కలను నిజం చేసే దిశగా ప్రధాని కీలక ప్రకటన
ఆ రెండు ప్రాజెక్టులకు..
అమరావతి రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రైవేటు సంస్థలకు సైతం భూ కేటాయింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం ఇక్కడ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా జనరల్ ఫూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ క్వార్టర్సు నిర్మాణం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్( common Central Secretariat) భవనం ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక ఆమోదం తెలిపారు. అమరావతిని ఒక పరిపాలన కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కీలకంగా నిలవన ఉందని కూటమినేత్తలు అభిప్రాయపడుతున్నారు కాగా జనరల్ ఫూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.1329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి రూ1458 కోట్లు ఇప్పటికే కేటాయించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది మరో మెట్టు అని కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు
అయితే అమరావతిలో చేపట్టనున్న ఈ రెండు ప్రాజెక్టులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు( Central Government employees) ఎంతో మేలు జరగనుంది. ముఖ్యంగా వారి స్థిర నివాస ఏర్పాటుకు దోహదపడతాయి. కామన్ సెక్రటేరియట్ భవనం ద్వారా కేంద్ర రాష్ట్ర పరిపాలన వ్యవస్థల సమన్వయం మెరుగు పడనుంది. అమరావతి నగర అభివృద్ధికి మరింత బలం చేకూరనుంది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత కూడా రెవెన్యూ టవర్స్, హైకోర్టు భవనం, శాసనమండలి భవనం, ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వంటి అనేక నిర్మాణాలకు కేంద్రం నుంచి సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Amaravathi Capital : అమరావతిని ఇక ఎవ్వరు ఆపలేరు.. ఆ 15వేల కోట్లపై కీలక పరిణామం
వాస్తవానికి అమరావతిలో ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి 2018 లోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో రాజకీయంగా ఎన్డీఏ విభేదించారు చంద్రబాబు. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి జాప్యం జరిగింది. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఈ రెండు ప్రాజెక్టులు పున ప్రారంభం అవుతున్నాయి. మొత్తానికైతే అమరావతికి అన్ని సానుకూలతలు కనిపిస్తున్నాయి.