Amaravati Capital Construction Updates: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది కూటమి ప్రభుత్వం. గడిచిన ఎన్నికల్లో అమరావతి రాజధాని విశేషంగా ప్రభావం చూపింది. మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. వైసిపి అనుసరించిన మూడు రాజధానులకు జనాలు హర్షించలేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే గత ఐదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం అయిన రాజధాని.. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కళను సంతరించుకుంది. రెట్టింపు ఉత్సాహంతో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది.
Also Read: తీరాన్ని తాకిన వాయు’గండం’.. ఆ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు!
లోపాలపై జగన్..
అయితే ఇప్పుడు అమరావతి చుట్టూనే ఏపీ రాజకీయాలు( AP politics) తిరుగుతున్నాయి. అమరావతి పై నేరుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడం లేదు. అయితే మొన్నటికి మొన్న అమరావతిపై అదే విషం చెందింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా. అమరావతి రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ సాక్షి మీడియాలో ఓ జర్నలిస్టు అనుచిత వ్యాఖ్యలు చేశారు. సదరు యాంకర్ సైతం దానిని సమర్థిస్తూ మాట్లాడారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర చాటింది. ఆ పార్టీ ఇప్పటికీ అమరావతికి వ్యతిరేకం అని సంకేతాలు వచ్చాయి. తాజాగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అయితే అమరావతిలో చిపల వ్యాపారం చేసుకోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిన అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోయే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు అమరావతి నిర్మాణంలో లోపాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఖర్చుకు మించి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారంటూ కొత్త వాదనలు అందుకున్నారు. తద్వారా తమ మూడు రాజధానుల విషయాన్ని పక్కన పెట్టి.. ఇకనుంచి అమరావతి రాజధాని నిర్మాణంలో లోపాలను బయట పెట్టే అవకాశం కనిపిస్తోంది.
భూముల సేకరణకు బ్రేక్..
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి రెండో విడత భూముల సేకరణ పై రకరకాల చర్చ నడుస్తోంది. గతం మాదిరిగా అమరావతి రైతుల కళ్ళల్లో పెద్దగా ఆనందం కనిపించలేదు. పైగా ఇప్పుడు భూములను సమీకరించడం ద్వారా ఒక రకమైన అయోమయం ఉంటుందన్నది రైతుల అభిప్రాయం. మొదటి విడతలో సేకరించిన భూములకు సంబంధించి వైసిపి( YSR Congress ) హయాంలో రైతులు ఇబ్బంది పడ్డారు. అందుకే తొలి విడతగా సేకరించిన భూములలో రాజధాని నిర్మాణం చేపట్టి.. అవసరమైతే మరోసారి భూ సమీకరణ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరావతి రైతుల సైతం పెద్దగా భూములు ఇచ్చేందుకు ప్రస్తుతం సుముఖంగా లేరు. దీనిపై పవన్ కళ్యాణ్ సైతం అభ్యంతరాలు తెలిపారు. రైతుల అభిప్రాయాలను గౌరవించి మాత్రమే వారి నుంచి భూములు సహకరించాలని కోరారు. అయితే దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలను కనుగొందామని చంద్రబాబు ఇప్పటితో దానిని ముగించారు.
Also Read: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా.. జగన్ బ్రహ్మాస్త్రం!
సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు..
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణంలో గతం మాదిరిగా సింగపూర్( Singapore) ప్రభుత్వం సహకారం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈరోజు చంద్రబాబు బృందం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. ఈ తరుణంలో అమరావతి రాజధాని నిర్మాణం పై చంద్రబాబు బృందం చర్చించే అవకాశం ఉంది. ఈరోజు సింగపూర్ పర్యటనలో ఇదో ప్రధాన అజెండాగా నిలవనుంది. మొత్తానికైతే ఇప్పుడు అందరి చూపు అమరావతి పై ఉంది. అయితే అమరావతి రాజధాని నిర్మాణాన్ని చురుగ్గా తీసుకొని వెళ్లేందుకు ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు దోహదం చేయనున్నాయి అన్నమాట. మరి ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.