Coca-Cola and Pepsi: ఖర్జూరాలు ఎడారి దేశాలలో పండుతాయి. ఖర్జూరాలలో రకరకాలు ఉంటాయి. వీటిలో ప్రీమియం డేట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రీమియం డేట్స్ ఎక్కువగా సౌదీ అరేబియాలో పండుతాయి. అయితే ఇప్పటివరకు ప్రీమియం డేట్స్ ను కేవలం పండ్ల రూపంలోనే సౌదీ అరేబియా ఇతర దేశాలకు ఎగుమతి చేసేది. తన అవసరాలు కూడా తీర్చుకునేది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా సౌదీ అరేబియా తన మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చేసింది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త ప్రణాళిక రూపొందించింది. తద్వారా ప్రపంచం మొత్తం ఇప్పుడు సౌదీ అరేబియా వైపు చూస్తోంది.
సౌదీ అరేబియాలో ప్రీమియం డేట్స్ ఎక్కువగా పండుతాయి. వీటిని ప్రపంచ దేశాలకు సౌదీ అరేబియా ఎగుమతి చేస్తూ ఉంటుంది. అయితే తన మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి.. బేవరేజెస్ విభాగంలో తనకంటూ బ్రాండ్ సృష్టించుకోవడానికి సౌదీ అరేబియా సరికొత్త ప్రణాళికలు రూపొందించింది. తొలిసారిగా మిలాఫ్ కోలా అనే బ్రాండ్ సృష్టించింది. ఇది ప్రీమియం డేట్స్ తో తయారు చేసే సాఫ్ట్ డ్రింక్. దీనిని తురాత్ ఆల్ మదీనా రూపొందించింది.. ఈ సంస్థకు సౌదీ అరేబియా అనేక రాయితీలు కల్పించింది. ఇటీవల రియాజ్ డేట్ ఫెస్టివల్ లో ఈ సాఫ్ట్ డ్రింక్ ను ఆవిష్కరించారు.
Also Read: టెస్లాకు పోటీ.. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ రెడీ.. అట్లుంటదీ ఇండియన్స్ తోని
మిలాఫ్ కోలాలో ఎటువంటి చక్కెరలను ఉపయోగించరు. కృత్రిమ పదార్థాలను వినియోగించరు. కేవలం ప్రీమియం డేట్స్ ను మాత్రమే ఉపయోగిస్తారు. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుందని.. శరీరానికి కావలసిన అన్ని పదార్థాలు అందుతాయని తయారీదారులు చెబుతున్నారు.. అంతేకాదు ఈ సాఫ్ట్ డ్రింక్ కేవలం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించామని.. అందువల్లే ప్రీమియం డేట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు.. వాస్తవానికి ఈ డ్రింక్ 2030 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సౌదీ అరేబియా భావించినప్పటికీ.. ఐదు సంవత్సరాలు ముందుగానే మార్కెట్లోకి వచ్చింది. ఈ డ్రింక్ వల్ల తమ దేశ ప్రాశస్త్యం మరింత పెరుగుతుందని సౌదీ అరేబియా భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న శీతల పానీయాలు మొత్తం కృత్రిమ పదార్థాలతో తయారుచేసినవే. వాటిని అదే పనిగా తాగితే ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో సౌదీ అరేబియా తీసుకొచ్చిన మిలాఫ్ కోలా గేమ్ చేంజర్ అవుతుందని.. సాఫ్ట్ డ్రింక్ విభాగంలో ఆ దేశానికి అద్భుతమైన పేరు తీసుకొస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో శీతల పానీయాల విభాగంలో కోకో కోలా, పెప్సికో తిరుగులేని సంస్థలు గా ఉన్నాయి. ఇవి వేలకోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శీతల పానీయాల వ్యాపారం మొత్తం ఈ రెండు కంపెనీల చేతిలోనే ఉంది. ఈ రెండు కంపెనీలను ఇప్పుడు సౌదీ అరేబియా దెబ్బతిస్తుందా? ఒకవేళ సౌదీ అరేబియా ప్రయత్నాన్ని ఈ రెండు కంపెనీలు ఎలా అడ్డుకుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ పెప్సికో, కోకో కోలా కంపెనీలను కనుక సౌదీ అరేబియా కంపెనీ అధిగమిస్తే శీతల పానీయాల విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అంతేకాదు వేలకోట్ల వ్యాపారాన్ని తన చేతిలో పెట్టుకుంటుంది. అయితే ఇది రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పనికాదు.