Mini Airports In AP: ఏపీ ప్రభుత్వం( AP government) పర్యాటక రంగంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పరచాలని భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మూడు మినీ ఎయిర్పోర్టులను తీసుకురావాలని నిర్ణయించింది. హెలికాప్టర్ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి హెలికాప్టర్ సేవలు అందించడానికి ఏజెన్సీలను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, అరకు ప్రాంతాల మధ్య ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో హెలికాప్టర్ పర్యాటకం నిరంతరం అందుబాటులో ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. నిరంతరం హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి. పర్యాటక ప్రాంతాలను ఆకాశమార్గంలో చూసే అరుదైన అవకాశం కల్పించనున్నారు.
Also Read: జగన్ తో షర్మిల భేటీ?
* హెలిక్యాప్టర్ టూరిజం..
రాష్ట్రంలో హెలిక్యాప్టర్ టూరిజం( helicopter tourism ) అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మూడు ప్రాంతాల నుంచి హెలికాప్టర్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆసక్తి కలిగిన ప్రైవేట్ ఏజెన్సీ ల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. ఎక్కడ హెలిప్యాడ్లను ఏర్పాటు చెయ్యాలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం హెలికాప్టర్ ద్వారా పర్యాటకులకు జాలి రైట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే అందుబాటులో ఉంటోంది. ఇకనుంచి అలా కాకుండా నిరంతరాయంగా సేవలందిలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం, మచిలీపట్నం, అరకు ఉత్సవాల్లో ప్రైవేట్ వీటిని నిర్వహించాయి. అక్కడ సక్సెస్ ఫుల్ గా కనిపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తోంది.
* పర్యాటక ప్రాంతాలను కలుపుతూ..
ప్రధానంగా పర్యాటక ప్రాంతాలను( tourism places) కలుపుతూ హెలిక్యాప్టర్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది. విజయవాడ నుంచి శ్రీశైలం, హైదరాబాద్ నుంచి శ్రీశైలం, అరకు నుంచి విశాఖ మధ్య హెలికాప్టర్ సేవలను నడపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రతిరోజు విజయవాడ, హైదరాబాదు నుంచి భక్తులు శ్రీశైలం వెళ్తుంటారు. వారికోసం రెండు వైపులా హెలిక్యాప్టర్ సేవలు తీసుకొస్తే గిరాకీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రూట్లో హెలికాప్టర్ సేవలు మొదలుపెడితే మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు.
* మినీ ఎయిర్ పోర్టుల నిర్మాణం
మరోవైపు విశాఖ జిల్లాలో( Vishakha district ) మన్య ప్రాంతంలో మినీ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. చిన్న చిన్న విమానాలతో పాటు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే విధంగా వీటిని నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. హెలికాప్టర్ టూరిజం ప్రోత్సహించే దిశగా విశాఖ, అరకు తో పాటు విజయవాడ, శ్రీశైలంలో వీటిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తోంది. సాధారణ విమానాశ్రయాల్లో ఉండే సౌకర్యాలు ఇక్కడ ఉండనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న హెలిక్యాప్టర్ టూరిజం అనుగుణంగానే ఇక్కడ జాలీ ట్రావెలింగ్ కు ప్రభుత్వం యోచన చేస్తోంది.