https://oktelugu.com/

Prabhas : రేపు అభిమానులకు తన ఇంస్టాగ్రామ్ లో ఫ్యూజులు ఎగిరిపోయి రేంజ్ సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్..వైరల్ అవుతున్న వీడియో!

ప్రభాస్ చెప్పబోయే ఈ అప్డేట్ ఆయన త్వరలో హను రాఘవాపుడితో చేయబోతున్న 'ఫౌజీ' చిత్రానికి సంబంధించినది అని తెలుస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లేకుండా రెండు చిన్న షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసారు.

Written By: , Updated On : January 25, 2025 / 07:59 PM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas :  అప్పుడప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ లు ఇస్తూ ఉంటాడు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి జరిగాయి. అలాంటి సర్ప్రైజ్ రేపు ఆయన మరోసారి ఇవ్వబోతున్నాడు. ఆ షాకింగ్ సప్రైజ్ కోసం అభిమానులు నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పై రేపు ఉదయం ఒక కన్ను వేయండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు. ఇంతకు ఏమిటి ఆ సర్ప్రైజ్, తన తదుపరి సినిమా గురించి ఏమైనా చెప్పబోతున్నాడా? , లేకపోతే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా కీలక అప్డేట్ ఇవ్వబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రభాస్ చెప్పబోయే ఈ అప్డేట్ ఆయన త్వరలో హను రాఘవాపుడితో చేయబోతున్న ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించినది అని తెలుస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లేకుండా రెండు చిన్న షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసారు.

కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనలేదు. త్వరలో జరగబోయే 20 రోజుల భారీ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్, ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. ఇదంతా పక్కన పెడితే రేపు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ ముందుగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అగ్రహారం లోని ఒక బ్రాహ్మణా కుర్రాడి క్యారక్టర్ ని చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడా?, లేదా ఒక బ్రాహ్మణ కుర్రాడు ఆర్మీ ఆఫీసర్ ఎలా అయ్యాడు అనేది చూపించబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ఇమాన్వి అనే కొత్త అమ్మాయి నటించబోతుంది.

ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఈమె హను రాఘవపూడి దృష్టిలో పడింది. తన సినిమాలోని హీరోయిన్ క్యారక్టర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆమెలో కనిపించడం తో వెంటనే పిలిపించి తన సినిమాలో అవకాశం ఇచ్చేశాడు. ఒక ఇండియా ఆర్మీ ఆఫీసర్ కి, అదే విధంగా ఒక పాకిస్థాన్ అమ్మాయికి మధ్య రజాకార్ ఉద్యమ సమయంలో జరిగిన ఒక లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే మరో ల్యాండ్ మార్క్ చిత్రం గా ఈ సినిమా నిలిచిపోతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.