NRI Employees : మీరు విదేశాల్లో ఉంటున్నారా.. చదువుకుంటూ.. ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్‌కం కోసం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. స్థానిక చట్టాలు. నిబంధనలు తెలుసుకోకుండా వీడియోలు తీస్తే.. వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. ఉద్యోగాలు ఊడిపోతాయి. చదువులు మధ్యలోనే ఆగిపోతాయి. పెట్టెబేడ సర్దుకుని స‍్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది.
వీడియో తీస్తే ఉద్యోగం పోయింది..
భారత్‌కు చెందిన మేహుల్ ప్రజాపతి కెనడాలో ఉంటూ ప్రముఖ టీడీ బ్యాంక్‌లో డేటా సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సైడ్ ఇన్‌కం కోసం కెనడా దేశం, అక్కడి సదుపాయాలు గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా వివరిస్తుంటాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కెనడాలో డబ్బు ఆదా చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు తెలుపుతూ ఓ వీడియో చేశాడు. అంతే.. ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.
ఏం జరిగింది?
మెహుల్ ప్రజాపతి వార్షిక వేతనం రూ.81 లక్షలు. అవి సరిపోక డబ్బులు ఆదా చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కెనడాలో విద్యార్థులకు ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకుల నుంచి మెహుల్ ప్రజాపతి ప్రతినెలా తెచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆయనే వీడియోలో వివరించాడు. దీంతో నెల ఆహారం, కిరాణా సామగ్రి ఖర్చు పూర్తిగా తగ్గిపోతుందని వెల్లడించాడు. మరో వీడియోలో తాను వారానికి సరిపడ భోజనం ఫ్రీగా తెచ్చుకున్నానని తెలిపాడు. వాటిలో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్‌లు, పాస్తా, క్యాన్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయని వీడియోలో చూపించాడు.
ఉద్యోగం ఊస్ట్..
ఈ వీడియో తాను పనిచేస్తున్న టీడీ బ్యాంకు యాజమాన్యం దృష్టికి వెళ్లింది. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, చర్చిల ద్వారా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ నుంచి మెహుల్ ఆహారం తెచ్చుకోవడాన్ని తప్పుపట్టింది. ఏడాదికి సుమారు రూ.80 లక్షల జీతం తీసుకుంటూ ఫుడ్ బ్యాంక్ నుంచి ఆహారం తీసుకోవడంపై వార్నింగ్ ఇచ్చింది. అతడిని విధుల నుంచి తొలగించింది. దీనికి సంబంధించిన మెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
update: the food bank bandit was fired https://t.co/RFLqvVGJb1 pic.twitter.com/CDdrfrmbqI
— pagliacci the hated (@Slatzism) April 22, 2024