Actress Jayasudha: రాజకీయాలను చాలామంది సీరియస్ గా తీసుకోరు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్న రీతిలో ఉంటారు. అటువంటి నేతలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు కూడా. అయితే వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక చాలామంది చతికిల పడుతుంటారు. అటువంటి వారిలో సినీనటి జయసుధ( cine actor Jayasudha ) ఒక్కరు. దివంగత రాజశేఖరరెడ్డి పిలిచి మరి ఆమెకు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేశారన్న మంచి పేరును దక్కించుకున్నారు. అయితే 2014లో రాష్ట్ర విభజనతో ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఉంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆమె తిరగని పార్టీ లేదు. చేరని పార్టీ లేదు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
సహజ నటిగా పేరు
సినీ పరిశ్రమలో( cine industry ) తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు జయసుధ. సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె మనసు మళ్లీ రాజకీయాల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయిన వారు ఇటువైపు రావడం చాలా అరుదు. చిరంజీవి లాంటి వారే ఈ రాజకీయాలకు ఒక నమస్కారం అని దండం పెట్టి తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. అటువంటిది ఏడు పదుల వయసులో ఉన్న జయసుధ మళ్లీ పొలిటికల్ రీయంట్రి అంటే చాలా కష్టమే. పైగా చాలా పార్టీలను చూసిన ఆమె మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటనేది ప్రశ్న.
బిజెపిలోనే ఉన్నా..
ప్రస్తుతం బిజెపిలో( Bhartiya Janata Party) ఉన్నారు జయసుధ. కానీ అంత యాక్టివ్ గా లేరు కూడా. 2023 ఎన్నికల్లో సికింద్రాబాద్ తో పాటు ముషీరాబాద్ బిజెపి అభ్యర్థిగా ఆమె పేరు వినిపించింది. కానీ బిజెపి హైకమాండ్ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆపై ఆమె బిజెపికి ప్రచారం చేసింది కూడా తక్కువే. ఆమె స్వస్థలం ఏపీ కాగా కృష్ణాజిల్లాలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పార్టీల్లో నేతలకు తక్కువేం కాదు. ఇప్పటికే అక్కడ ఉక్క పోత ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తన లక్ష్యం దగ్గర కావచ్చు అన్నది ఆమె ఆలోచన. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ లేదు. జయసుధ ను చేర్చుకుంటే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. త్వరలో ఆమె వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. కానీ ఎప్పటికీ పార్టీలు మారిన జయసుధతో.. పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని వైసీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి.