Homeఆంధ్రప్రదేశ్‌Actor Brahmaji : కూటమి ప్రభుత్వంపై జగన్ ట్వీట్.. బ్రహ్మాజీ అదిరిపోయే రిప్లై.. పాపం వైసీపీ...

Actor Brahmaji : కూటమి ప్రభుత్వంపై జగన్ ట్వీట్.. బ్రహ్మాజీ అదిరిపోయే రిప్లై.. పాపం వైసీపీ శ్రేణుల ముఖం మాడిపోయింది

Actor Brahmaji : విజయవాడ పరిసర ప్రాంతాలు బుడమేరుకు పడిన గండ్ల వల్ల నీట మునిగాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. బుడమేరుకు పడిన గండ్లను ఆర్మీ అధికారులు రంగంలోకి దిగి పూడ్చారు. దీనికి స్థానికంగా ఉన్న అధికారులు కూడా సహకరించారు. గండ్లను పూడ్చే పనులను మంత్రులు లోకేష్, రామానాయుడు స్వయంగా పర్యవేక్షించారు. అయితే ప్రభుత్వం వరద బాధితులకు సక్రమంగా సహాయక చర్యలు అందించడం లేదని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడంలేదని ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ” బుడమేరు ఉప్పొంగి ప్రవహిస్తే అధికారులు ఏం చేశారు.. విజయవాడ నగరం మునిగిపోయింది కదా.. ప్రజల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కదా. సహాయక చర్యలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి కదా.. నాదెండ్ల మనోహర్ తో మీరు అన్న మాటలు నిజం కాదా.. నేను కూడా అదే విషయాన్ని చెబుతున్నాను కదా” అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. జగన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో.. నెటిజన్లు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ కౌంటర్ ఇస్తున్నారు. కొందరు వైసీపీ శ్రేణులు మాత్రం జగన్మోహన్ రెడ్డి అడిగిన విధానాన్ని సమర్థిస్తున్నారు. ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.

బ్రహ్మాజీ ఏమన్నారంటే..

జగన్ చేసిన ట్వీట్ నేపథ్యంలో.. ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ స్పందించారు.” మీరు కరెక్ట్ సార్. వాళ్లు చేయలేరు సార్. ఇకనుంచి మనం చేద్దాం సార్. ఫస్ట్ మనం 1000 కోట్లు రిలీజ్ చేద్దాం సార్. మన వైయస్ఆర్సీపీ క్యాడర్ మోతాన్ని రంగంలోకి దింపుదాం సార్. మనకు జనాల ముఖ్యంశాలు. గవర్నమెంట్ కాదు సార్. మనం చేసి చూపిద్దాం సార్. జై జగన్ అన్న” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో బ్రహ్మాజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ను టిడిపి నెటిజన్లు తెగ రీ ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్ చేసిన కాసేపటికి.. బ్రహ్మాజీ స్పందించారు. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని పేర్కొన్నారు. తాను అలా ఎవరిని విమర్శించనని బ్రహ్మాజీ వివరించారు. కాకపోతే అప్పటికే బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసిన నెటిజన్లు దానిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంతమంది వైసిపి అభిమానులు బ్రహ్మాజీని ఉద్దేశించి విమర్శిస్తున్నారు.. చేయాల్సింది మొత్తం చేసి.. ఇప్పుడు ఎకౌంట్ హ్యాక్ అయిందని అంటున్నావా? అంటూ దుయ్యబడుతున్నారు. ఇలా విమర్శించే బదులు.. నేరుగా రాజకీయాల్లోకి రావచ్చు కదా అంటూ బ్రహ్మాజీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular