Acid Attack : బస్సు వేగంగా వెళ్తుండడం.. అందులో మహిళలు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలో ఉండడం.. ఇంతలోనే దుండగుడు తన జేబులో ఉన్న ద్రావణం తీసి వారి మీద పోయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. యాసిడ్ తన మీద పడడంతో ఆ మహిళలు కేకలు పెట్టారు. ఆ మహిళలపై యాసిడ్ పోసిన అనంతరం ఆ దుండగుడు బస్సు నుంచి దూకి పారిపోయాడు. అయితే ఆ మహిళలు యాసిడ్ దాడి వల్ల తీవ్రంగా గాయపడ్డారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో.. ఆ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు స్పందించి వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఈ వార్త దావానం లాగా వ్యాపించడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. విచారణ చేపట్టారు. ఆ బస్సు విశాఖపట్నంలోని కంచరపాలెం ఐటిఐ జంక్షన్ నుంచి వెళ్తోంది. ఆ బస్సులోకి గుర్తు తెలియని వ్యక్తి ఎక్కాడు. బస్సు సిటీ దాటగానే వెంటనే తన జేబులో ఉన్న బాటిల్ తీసి.. అందులో ఉన్న యాసిడ్ ముగ్గురు మహిళల మీద చల్లాడు. యాసిడ్ పోయడంతో ఒకసారిగా మంటలు చెలరేగడం.. ఆ మంటలకు ఆ మహిళలు గాయపడటం.. వారు కేకలు పెట్టడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ వాహనాన్ని ఒకసారి ఆపాడు. కండక్టర్, ఇతర ప్రయాణికులు ఆ దుండగుడిని పట్టుకోడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు చాకచక్యంగా బస్సు దిగి పారిపోయాడు. యాసిడ్ మంటల ధాటికి ఆ మహిళలు గాయపడ్డారు. కళ్ళు విపరీతంగా మండుతున్నాయని ఆర్తనాదాలు పెట్టారు. అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది.. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
ఎందుకు దాడి చేశాడు
బస్సులో అంతమంది మహిళలు ప్రయాణిస్తుండగా.. దుండగుడు కేవలం ఈ ముగ్గురిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశాడు అనేది అంతు చిక్కకుండా ఉంది. బస్సు అకస్మాత్తుగా ఎక్కిన అతడు.. వెంటనే టికెట్ తీసుకొని.. ఆ మహిళలు కూర్చున్న సీట్ల సమీపం వద్దకు వెళ్లాడు. కంచరపాలెం ఐటిఐ జంక్షన్ దాటగానే తన జేబులో ఉన్న బాటిల్ తీసి అందులో ఉన్న యాసిడ్ ను మహిళల మీద చల్లాడు. అయితే అతడి గురించి పోలీసులు ప్రయాణికులను వాకబు చేయగా తమకు తెలియదని పేర్కొన్నారు. ఆ దుండగుడి ఆచూకీ కోసం పోలీసులు సిసి ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఆ బాధిత మహిళలతో ఆ నిందితుడికి ఏమైనా సంబంధం ఉందా? ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా? గతంలో ఏమైనా గొడవలు జరిగాయా? నిందితుడి మెంటల్ కండిషన్ బాగానే ఉందా? కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మహిళలపై ఆగడాలు పెరిగిపోయాయి. ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ దాడులు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా మహిళలపై ఓ దుండగుడు యాసిడ్ దాటి చేయడం కలకలం రేపుతోంది. మరోవైపు దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు.