Deputy CM Pawan Kalyan : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ ఆగ్రహంగా మాట్లాడేవారు. దూకుడుగా వ్యవహరించేవారు.కానీ అధికారంలోకి వచ్చాక ఆయన వైఖరి మారింది.వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది.డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తరువాత సైలెంట్ గా కనిపించారు పవన్. తన శాఖల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.పూర్తిస్థాయి అధ్యయనం చేశారు. క్రమేపి యాక్టివ్ అయ్యారు.పాలన వైఫల్యాలను తెలుసుకున్నారు.రాజకీయాలు సైతం మాట్లాడుతున్నారు.సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడి జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారు.రాజకీయాలతో పాటు ఏపీ ప్రభుత్వంలో కూడా తనకంటూ ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇలా వచ్చిన ఆయన కాకినాడ పోర్టుపై ఫోకస్ పెట్టారు. వైసిపి ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం రవాణా జరిగిందని పవన్ ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ.. అదేపోర్టుపై దృష్టి పెట్టడం విశేషం. తన పార్టీకి చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను తరచూ కాకినాడ పోర్టుకు పంపించేవారు. అక్కడ బియ్యం రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రేషన్ మాఫియా అప్రమత్తం అయ్యింది. వారికి సహకరిస్తున్న అధికారులు అలెర్ట్ అయ్యారు.
* ఆసక్తికర విషయాలు
తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండు నెలలుగా ఇక్కడ పరిశీలన చేయాలని ప్రయత్నించినా.. పవన్ కు ఎంట్రీ లభించలేదు. వాస్తవానికి ఇంతకు ముందే మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించి వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే విషయం పెద్దదవుతుందని భావించిన అధికారులు ఆయన రాకుండా శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పుకొచ్చారు కూడా. అంటే ఓ డిప్యూటీ సీఎంనే అడ్డుకునే స్థాయిలో అధికారులతో పాటు రేషన్ మాఫియా ఉందన్నమాట.
*:వేలాదిమంది ఉపాధి పోతుందట
డిప్యూటీ సీఎం పవన్ వస్తే కాకినాడ పోర్టులో పదివేల మంది కార్మికుల ఉపాధి పోతుందని కొందరు అధికారులు చెప్పుకొచ్చారట.ఇదే విషయాన్ని పవన్ సైతం ప్రస్తావించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. అయితే పవన్ కాకినాడ పోర్టుకు వెళ్లారు. కాకినాడ కలెక్టర్ అడ్డుకున్న సౌత్ ఆఫ్రికా షిప్ ను చూసేందుకు ముందుకు కదిలారు. అప్పుడు కూడా కొందరు అధికారులు అడ్డు తగిలారు. వాతావరణం సరిగా లేదని కారణాలు చెప్పారు. కానీ పవన్ ను అడ్డుకోలేకపోయారు. దీంతో పోర్టులో ఉన్న లోపాలను గుర్తించగలిగారు పవన్. ముఖ్యంగా ఇంతటి పోర్టుకు16 మందితో భద్రత కల్పించడం, తనిఖీ యంత్రాంగం లేకపోవడాన్ని తప్పు పట్టారు పవన్. కేంద్ర భద్రత పెంచాలని హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు పవన్. మొత్తానికైతే డిప్యూటీ సీఎం పవన్ ను అడ్డుకోవాలని చూశారు పోర్టు అధికారులు. కానీ వాటన్నింటినీ అధిగమించి తాను చేయాలనుకున్నది చేశారు. లోపాలను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించగలిగారు.