AP Election Survey 2024: ఏపీలో ఆ పార్టీకే పట్టం కట్టిన మరో సర్వే సంస్థ.. వైరల్‌ అవుతున్న సర్వే ఫలితాలు

నాగన్న సర్వే ప్రకాం.. ఏపీలో అధికార వైసీపీ 96 స్థానాల్లో, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 46 స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది. 33 చోట్ల రెండు పక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది.

Written By: Raj Shekar, Updated On : May 30, 2024 3:43 pm

AP Election Survey 2024

Follow us on

AP Election Survey 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఏడో విడత ఎన్నికలు జూన్‌ 1న 57 స్థానాలకు జరుగనున్నాయి. ఈ స్థానాలకు 902 మంది పోటీ పడుతున్నారు. చివరి దశ ఎన్నిలు ముగిసిన సాయంత్రమే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. యావత్‌ దేశం లోక్‌సభ ఎన్నికలతోపాటు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఉంది. ఎవరికీ అంతుచిక్కని ఫలితాలతో ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జన సేన కూటమి ఎవరూ గెలుపు తమదని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే టౌమ్స్‌ నౌ సర్వే ఫలితాల పేరిటో సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొట్టింది. తాజాగా మరో సర్వే ఫలితాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నాగన్న సర్వే ఇలా..
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో ఇటీవల టైమ్స్‌నౌ ఫలితాలు వైరల్‌ కాగా, తాజాగా నాగన్న సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాల పేరుతో ఓ పీడీఎఫ్‌ ఫైల్‌ వైరల్‌ అవుతోంది. టౌమ్స్‌నౌ సర్వే ఫలితాల తరహాలోనే నాగన్న సర్వే ఫలితాలు ఉన్నాయి. టైమ్స్‌నౌ ఏపీలో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చగా, తాజాగా నాగన్న సర్వే కూడా అదే తేల్చింది.

ఎవరికి ఎన్ని సీట్లంటే..
నాగన్న సర్వే ప్రకాం.. ఏపీలో అధికార వైసీపీ 96 స్థానాల్లో, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 46 స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది. 33 చోట్ల రెండు పక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది. ఇక లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే.. మొత్తం 25 స్థానాల్లో అధికార వైసీపీ 17 స్థానాలు గెలుస్తుందని, కూటమికి కేవలం 4 స్థానాలే వస్తాయని తెలిపింది. మకొ 4 స్థానాల్లో ఇరుపక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.

పార్టీల వారీగా ఓటింగ్‌ శాతం..
ఇక పార్టీల వారీగా ఓటింగ్‌ శాతం వివరాలు కూడా ఇందులో పేర్కొంది. అధికార వైసీపీకి 48 శాతం నుంచి 50 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కూటమికి 45 నుంచి 47 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. కేవలం మూడు నాలుగు, శాంత ఓట్లతోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. ఇక ఈ సర్వేలో నియోజకవర్గాల వారీగా కూడా పార్టీలకు ఓటింగ్‌ శాతం వివరాలు ఇచ్చింది.

జగన్‌దే జయం..
నాగన్న సర్వే ప్రకారం కూడా ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగనే విజయ ఢంకా మోగించనున్నారు. ఈ సర్వే ప్రకారం.. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీకి 96+22 = 118 స్థానాలు, కూటమికి 46+03=49 స్థానాలు వస్తాయని తేల్చింది. 8 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.