Telangana Symbol: చిహ్నం మార్పుపై రేవంత్ వెనకడుగు..?

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నాళ్ల క్రితం తెలంగాణ అధికార గీతం, అధికారిక చిహ్నం,తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మార్పులు చేర్పులు చేయాలని భావించడం పెద్ద చర్చకు దారితీసింది.

Written By: Neelambaram, Updated On : May 30, 2024 3:35 pm

Telangana Symbol

Follow us on

Telangana Symbol: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకడుగు వేశారు. మెజార్టీ వర్గాల నుంచి విమర్శలు వస్తుండడంతో ఆయన బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిలో కాకతీయులు,నిజాములది కీలక భూమికే. ముఖ్యంగా కాకతీయుల రాజులకైతే ప్రజల్లో ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. అందుకే గత ప్రభుత్వం తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణానికి ప్రయారిటీ కల్పించింది. దీంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ సింబల్ గా ఉన్న చార్మినార్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చోటు కల్పించారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నాళ్ల క్రితం తెలంగాణ అధికార గీతం, అధికారిక చిహ్నం,తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో మార్పులు చేర్పులు చేయాలని భావించడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే రేవంత్ రెడ్డి వాటిని వేటిని పట్టించుకోకుండానే ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ గీతానికి ఆంధ్రాకు చెందిన కీరవాణి సంగీతాన్ని సమకూర్చడంపై పలువురు విమర్శించినప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ గీతంగా జయ జయహే తెలంగాణను ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించింది.

మరో వైపు తెలంగాణ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం,చార్మినార్ ను తొలగిస్తున్నట్లు సామాజిక మాధ్యమాలు,సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడం.. ప్రభుత్వంపై విమర్శలు మొదలవడంతో ఇప్పుడే చిహ్న విషయంలో నిర్ణయం తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అందుకే జూన్ 2న కేవలం రాష్ట్ర గీతాన్ని ఫైనల్ చేసి..తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు..రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల అంశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.