Chandrababu: ఢిల్లీ ఎన్నికలను పురస్కరించుకొని.. తెలుగు మీడియా శనివారం ఉదయం నుంచి ప్రత్యేకంగా లైవ్, డిబేట్ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో ఏబీఎన్ కూడా ఉంది.. అయితే ఈ ఛానల్ లో నిర్వహించిన డిబేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో దక్షిణాది ప్రాంతాలలో బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఆ ప్రాంతంలో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. దీనిని చంద్రబాబు ఖాతాలో వేయడానికి.. ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కడానికి ఏబీఎన్ చేయని ప్రయత్నం అంటూ లేదు.. దీనికి సంబంధించి కొంతమందితో డిబేట్ నిర్వహించింది.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసేలా ఏబీఎన్ న్యూస్ ప్రజెంటర్ వెంకటకృష్ణ పదేపదే ప్రశ్నలు సంధించారు.. ఆ దిశగా సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే అందులో ఓ వ్యక్తి మాత్రం విభిన్నంగా మాట్లాడాడు.. వెంకటకృష్ణ లైన్ లో కాకుండా.. వాస్తవాలు మాట్లాడాడు. ” చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో నాడు పొత్తు పెట్టుకున్నాడు. నల్ల రంగు చొక్కాలు వేసుకొని బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని చెప్పి.. ఆ పార్టీతోనే పొత్తు కుదుర్చుకున్నాడు. ఇప్పుడేమో బిజెపికి మద్దతు పలుకుతున్నాడని” ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు.
ఆ తప్పు చేయడట
ఆ వ్యక్తి మాట్లాడుతుండగానే ఏబీఎన్ వెంకటకృష్ణ మధ్యలో కల్పించుకున్నాడు. ” చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకుదుర్చుకున్నాడు. ఆ తర్వాత తత్వం బోధపడి వెనక్కి తగ్గాడు. ఇకపై కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకోడు. ఆయన రాజకీయ జీవితంలో చేసిన తప్పు అదొక్కటి మాత్రమే. ఆ తప్పు మళ్లీ చేయరని అనుకుంటున్నానని” వెంకటకృష్ణ వ్యాఖ్యానించాడు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యల వినిపించడంతో.. ఒక్కసారిగా అలర్ట్ అయిన వెంకటకృష్ణ.. అక్కడి పరిస్థితిని మొత్తం మార్చేశాడు. చంద్రబాబుకు పాజిటివ్ కోణంలో మాట్లాడాడు. శనివారం ఉదయం నుంచి ఏబీఎన్ లో ప్రసారమైన ఈ డిబేట్లో చంద్రబాబుకు అనుకూలంగానే వెంకటకృష్ణ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఢిల్లీ ఫలితాలను పక్కనపెట్టి.. కేవలం చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాలను మాత్రమే ప్రముఖంగా ఏబీఎన్ చూపించింది. కేవలం చంద్రబాబు వల్లే వారు గెలిచారనే కోణంలో వార్తలను ప్రసారం చేసింది. అయితే దీనిని వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ” ఢిల్లీలో గెలిచింది బిజెపి. కానీ ఏబీఎన్ దృష్టిలో ఢిల్లీలో బిజెపిని గెలిపించింది చంద్రబాబు. అదే కోణంలో వార్తలను ప్రసారం చేస్తోంది. వ్యక్తి పూజ చేయడంలో.. చేయని పనిని చేసినట్టు చూపించడంలో ఏబీఎన్ తర్వాత ఏదైనా.. మీడియా ముసుగులో ఇలా పార్టీ భజన చేసేవాళ్లను ఏమనాలి? ఇలాంటి వ్యక్తులు న్యూట్రల్ వార్తలను ప్రసారం చేస్తారంటే ఎలా నమ్మాలని” వైసిపి నాయకులు అంటున్నారు.
ఒక్కసారే కలిసాడు అంట కాంగ్రెస్ తో
మరి మిగతా పార్టీలు… థర్డ్ ఫ్రంట్ అన్నారు కదా
ఏమైనా కవర్ డ్రైవ్ నా @vkjourno
— For A Reason (@FAR_in_X) February 8, 2025