https://oktelugu.com/

Amaravathi  : బాబు అప్పుల లెక్కను బయటపెట్టి పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

 రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఒక్కోసారి మనం చేసిన విమర్శలే ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఎల్లో మీడియాకు అదే పరిస్థితి ఎదురైంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 31, 2024 / 06:24 PM IST
    Follow us on

    Amaravathi : ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయక తప్పదు. అప్పు చేస్తే కానీ పాలన సజావుగా నడవదు.కానీ సంక్షేమ పథకాల పుణ్యమా అని ప్రభుత్వాలు చేసే అప్పులు పెరుగుతున్నాయి. ఉచితం మాటున అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది.వచ్చే ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ కావడంతో అప్పు అనేది అనివార్యంగా మారింది. అయితే గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఏపీ మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందని.. అభివృద్ధిలో 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే అదే పనిగా ప్రచారం చేసింది. జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా, సంక్షేమం పథకం లబ్ధిదారులకు నగదు జమ కాకపోయినా.. ఓ రేంజ్ లో మీడియా విరుచుకుపడేది. ప్రతినెలా ఆర్థిక అవసరాల కోసం ఏపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్తే కథనాలు వండి వార్చేది. ఆర్థిక నిపుణులు అంటూ కొంతమందిని డిబేట్లకు పిలిచి జగన్ సర్కార్ తీరును ఎండగట్టేది. ఈ విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందుండేది. రకరకాల కారణాలతో రెచ్చిపోయేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. ఈ తక్కువ రోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అప్పులకు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం అమరావతికి అపురూపంలోనే నిధులు ప్రకటించినట్లు స్పష్టమైంది.
     * సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
     ప్రస్తుతం వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఒక పోస్టును వైరల్ చేస్తున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. బ్యాంకులకు ఓవర్ డ్రాఫ్ట్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ సైతం అప్పులను జమ చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి ప్రభుత్వం తెస్తున్న అప్పులు.. పాత అప్పులకు సంబంధించిన రుణ చెల్లింపులకు సరిపోతున్నాయని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.
    * తప్పు అంటున్న టిడిపి శ్రేణులు
     వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని టిడిపి శ్రేణులు ఖండిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని.. కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారని..  దాంతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన నగదును అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ పాత బకాయిలకు జమ చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల సెక్యూరిటీ బాండ్లను  వేలం వేసి నిధులను సమీకరించింది. అయితే టిడిపికి వ్యతిరేకంగా ఏబీఎన్ లో కథనాలు వస్తాయా? అన్న సందేహం కూడా ఉంది.
     * నెటిజెన్ల సెటైర్లు 
     అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ సర్కార్ అంటేనే అంతలా విరుచుకు పడిపోయే ఏబీఎన్ వెంకటకృష్ణకు నెటిజెన్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా వెంకటకృష్ణ అంటూ నిలదీసిన వారు కూడా ఉన్నారు. అయితే గతంలో టిడిపి ఏ ప్రచార అస్త్రాన్నైతే వాడుతుందో.. దానినే ఇప్పుడు వైసీపీ అవకాశంగా మలుచుకోవడం  విశేషం.
    అధిక వడ్డీకి నిన్న తెచ్చిన 3 వేల కోట్ల అప్పుతో 40 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 12 వేల కోట్ల రూపాయలకు చేరింది!!

    ఒక్క పధకం ఇవ్వకుండానే ఇంత అప్పా అని ప్రజలు నోళ్ళు వెల్లబెడుతున్నారు.

    పచ్చ మీడియాతో సహా. pic.twitter.com/s3x9UstzwP

    — YSRCP Brigade (@YSRCPBrigade) July 31, 2024