Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరు స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు హీరోలు చేసిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఆయన కత్తి పట్టుకొని యుద్ధం చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన గేమ్ చేంజర్ సినిమాలో కూడా హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని కిందికి దిగుతూ ఒక షాట్ అయితే మనకు ట్రైలర్ లో చూపించారు.
మరి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ని ఊచకోత కొయ్యబోతుంది అనే విషయం ఆయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇంకా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే తను గతంలో కత్తి పట్టిన మగధీర, రంగస్థలం సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడం ఇప్పుడు ఈ సినిమా మీద మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ఇక రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని కిందికి దిగుతున్నాడు అంటే రామ్ చరణ్ విలన్ల మోత మోగిస్తాడు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో అతని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన ఎలాంటి క్రేజ్ ను క్రియేట్ చేసుకోబోతున్నాడనేది తెలియాల్సి ఉంది…
మరి మొత్తానికైతే శంకర్ ఒక మంచి సినిమాలు తీశాడు అంటూ సుకుమార్ లాంటి దర్శకులు ఆయన్ని కొనియాడుతున్నారు. ఇక జనవరి 10వ తేదీ వస్తేగాని ఈ సినిమా హిట్టా లేదా ఫట్టా అనే విషయమైతే క్లారిటీగా తెలియదు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ప్రస్తుతం చాలా సెలెక్టెడ్ కథలను ఎంచుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…