Aadarna 3.0 scheme eligibility in AP : financial supportఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన అనేక పథకాలు అమలు కోసం కార్యాచరణ జరుగుతున్న సమయంలో ప్రస్తుతం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగానే ప్రభుత్వం పథకాలను కూడా అమలు చేసేందుకు ఆలోచిస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రారంభించిన ఆధారాల పథకాన్ని ఇప్పుడు మళ్లీ వెనుకబడిన తరగతుల వారికి అందరికీ వర్తించే విధంగా పున ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఆదరణ 3.0 అనే పేరుతో ఈ పథకాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొని రానుంది. రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీమతి సవిత గారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి చెందిన కుల వృత్తుల వారికి అలాగే చేతివృత్తుల వారికి వారి వృత్తిలో సాధికారతను కల్పించేందుకు వారి ఆదాయం పెంపొందించేందుకు ఆదరణ పథకాన్ని ప్రారంభించారు. బీసీ కులాల వారికి ఆదరణ పథకం కింద 90 శాతం సబ్సిడీతో పనిముట్లు ప్రభుత్వం అందజేసేది. వెనుకబడిన తరగతుల వారికి సబ్సిడీ కింద పనిముట్లు అలాగే ఉపకరణాలు అందించే వారిని ఆర్థికంగా పురోగతి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని తెలుస్తుంది.
బీసీలకు వెన్ను దున్ను పథకంగా ఆదరణ పథకాన్ని చెప్పుకోవచ్చు. వెనుకబడిన తరగతులకు చెందిన అనేక వృత్తుల వారు ఆదరణ పథకం కింద చాలా ప్రయోజనాలు పొందుతారు. కుమ్మరి, కమ్మరి, నాయి బ్రాహ్మణ, రజక, వడ్రంగి, టైలరింగ్, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు ఇలా మొదలైన వారు ఆదరణ పథకం కింద చాలా లబ్ధి పొందుతారు. అధికారికంగా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అర్హతలు ప్రకటించలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకం ప్రారంభించబడినది కాబట్టి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అర్హతలు కలిగి ఉండాలి.
ముఖ్యంగా లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఈ పథకానికి వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్లు అర్హులు. 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. రేషన్ కార్డు కలిగి ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పథకాల కొరకు ప్రవేశపెట్టిన ఆరెంజల విధానం లోబడి ఉండాలని తెలుస్తుంది. రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తో పాటు ఫోన్ నెంబర్ అవసరం అవుతాయి. అర్హులైన వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.