AP Government: గత ప్రభుత్వ పాలనలో ఏర్పాటు చేసిన గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థలో తాజాగా పాలనలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనేక మార్పులను చేపట్టింది.ప్రభుత్వము ముఖ్యంగా సచివాలయాల ప్రక్షాళన తో పాటు ఉద్యోగుల హేతుబద్ధీకరణ కోసం కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగులు కొన్ని కీలక డిమాండ్లను పెట్టారు. తాము ఉద్యోగంలో చేరిన రోజు నుంచి తమకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వానికి తెలిపారు. తక్షణమే దీనికి సంబంధించి బదిలీలు కూడా చేపట్టాలని వాళ్లు కోరారు. గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు రాష్ట్రంలో ఉన్న పలు పరిష్కారం కానీ సమస్యలపై డైరెక్టర్కు 9 అంశాలతో ఉన్న వినతి పత్రాన్ని సమర్పించారు. వాళ్లు గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను రికార్డు అసిస్టెంట్ క్యాడర్ నుంచి అప్ గ్రేడ్ చేసి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు బదిలీ చేయాలని డైరెక్టర్ ను కోరారు.
Read Also: అంతటి రష్యాను ఉక్రెయిన్ పడగొట్టింది.. మనకు ఎటువంటి పాఠాలు చెబుతోందంటే!
9 అంశాల డిమాండ్ పత్రంలో వీళ్ళు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయడంతో పాటు రికార్డు అసిస్టెంట్ క్యాడర్ లో ఉన్న ఉద్యోగులను చేస్తూ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు మార్చాలని అలాగే తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రవేశం డిక్లేర్ చేసిన రోజు కాకుండా ప్రవేశం డిక్లరేషన్ తేదీని రెండు ఏళ్ళు సర్వీస్ పూర్తిచేసిన రోజుగా మార్చాలని డైరెక్టర్ ను కోరారు. ఇప్పటికే ఆలస్యం అయినా ఈ తొమ్మిది నెలల కాలానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఉన్న అన్ని సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రోస్టర్ విధానంలో ప్రదర్శించాలని కూడా వాళ్ళు తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులలో ఏర్పడిన పే స్కేల్ అసమానతలను తొలగించాలని ప్రభుత్వానికి వినతి చేశారు. అవకాశం ఉన్నవరకు అర్హత కలిగిన సచివాలయ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలలో విలీనం చేయాలని కూడా కోరారు. తక్షణమే సచివాలయ ఉద్యోగులను సాధారణ బదిలీలతో పాటు అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డైరెక్టర్ ను కోరారు.