https://oktelugu.com/

Andhra Pradesh : వర్మీ కంపోస్ట్ షెడ్డులో ప్రియుడితో కలిసి భర్తపై ఈ భార్య చేసిన దారుణం

రవిశంకర్, ఊర్మిళ ఒక నిర్ణయానికి వచ్చారు. గత నెల నవంబరులో హత్య చేయడానికి డిసైడయ్యారు. అదే నెల 23న గజానంద్ ను కొట్టి చంపి.. అక్కడే పాతిపెట్టారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2023 / 04:11 PM IST

    Andhra Pradesh

    Follow us on

    Andhra Pradesh :  యజమానితో కలిసి భర్తను దారుణంగా హత్యచేసింది. తమ వివాహేతర సంబంధానికి, సుఖానికి అడ్డు వస్తున్నాడని తెలిసి ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అదృశ్యమయ్యాడని కట్టు కథలు అల్లింది. చివరకు పోలీస్ విచారణలో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజుతో ఘటనకు పాల్పడినట్టు ఒప్పుకుంది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వెలుగుచూసింది. గత ఏడాది నవంబరు 23న జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

    అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన రాయుడు రవిశంకర్ నిరుద్యోగి. తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 2016లో తెలంగాణలోని ఆదిలాబాద్ లో మసాలా వ్యాపారం చేసేవాడు. ఆ సమయంలో ఆయన వద్ద గజానంద్ అనే వ్యక్తి కారు డ్రైవర్ గా చేరాడు. అయితే వ్యాపారం సక్రమంగా జరగకపోవడంతో రవిశంకర్ తిరిగి స్వగ్రామం గంగలకుర్రు వచ్చేశాడు. గంగలకుర్రు అగ్రహారంలో వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. అయితే గతంలో తన వద్ద కారు డ్రైవర్ గా పనిచేసిన గజానంద్, అతని భార్య ఊర్మిళను వర్మీ కంపోస్టులో పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఊర్మిళతో రవిశంకర్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది.

    కొన్నాళ్ల పాటు వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది. అక్కడకు కొద్దిరోజులకు గజానంద్ కు ఈ విషయం తెలిసిపోయింది. అటు వర్మీకంపోస్టు యూనిట్ లాస్ రావడంతో రవిశంకర్ మోటార్ బైక్ ల స్పేర్స్ యూనిట్ల షాపును ఏర్పాటు చేశాడు. అయినా ఊర్మిళతో సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. తమ సరదాలకు అడ్డువస్తున్నాడని.. ఎలాగైనా మట్టుబెట్టాలని రవిశంకర్, ఊర్మిళ ఒక నిర్ణయానికి వచ్చారు. గత నెల నవంబరులో హత్య చేయడానికి డిసైడయ్యారు. అదే నెల 23న గజానంద్ ను కొట్టి చంపి.. అక్కడే పాతిపెట్టారు.

    అయితే గజానంద్ కనిపించకపోవడం, భార్య ఊర్మిళ ప్రవర్తన అనుమానంగా ఉండడంతో గజానంద్ తండ్రి శివాజీ హైదరాబాదులోని అబ్దుల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్టరీ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవిశంకర్, ఊర్మిళ ఇద్దరు కలిసి గజానంద్ ను హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం.. అబ్దుల్ గంజ్ పోలీసులు అంబాజీపేట స్టేషన్ కు కేసును బదిలీ చేయగా పి.గన్నవరం సీఐ ప్రశాంత్,అంబాజీపేట ఎస్ఐ చైతన్య కుమార్ కలిసి రవిశంకర్, ఊర్మిళను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తామే హత్య చేసినట్టు ఇద్దరూ ఒప్పుకున్నారు.