Ponnavolu Sudhakar Reddy: పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా.. ఎక్కడ చూసినా మార్మోగుతోంది. చంద్రబాబు కేసులో సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ గా సుధాకర్ రెడ్డి బలమైన వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తరఫున పేరు మోసిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూధ్ర వాదిస్తున్నారు. అయితే సుధాకర్ రెడ్డి గురించి సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. గతంలో ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన నిష్పక్షపాతంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఆ వీడియోలో రాజకీయ అనుకూల వ్యాఖ్యలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే. ” తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా.. పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్. ఎక్కడో ట్రయల్ కోర్టులో అడ్వకేట్ అయిన తనను పిలిచి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు”.. అంటూ ఏపీ సీఎం జగన్ పై కృతజ్ఞతా భావం చూపారు. పొగడ్తల వర్షం కురిపించారు. తనకు జగన్తో పదేళ్లుగా ఉన్న అనుబంధం గురించి ఈ వీడియోలో స్పష్టంగా వివరించారు. తమ బంధం గురించి తలుచుకుంటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుందని చెప్పుకొచ్చారు. తనకు వేరే మాస్క్ ఏం లేదని… జగన్ ఏది చెప్తే అది చేస్తానని స్పష్టం చేశారు. తాను అడ్వకేట్ జనరల్ అయినా పార్టీతో సంబంధం, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్యుడ్ని కాదని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుధాకర్ రెడ్డి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒకరికి కొమ్ము కాయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జగన్కు వత్తాసు పలకాలనుకుంటే తన పదవికి రాజీనామా చేసి సలహాదారుడుగా చేరాలని పలువురు సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మొత్తానికైతే జగన్ పై తన అభిమానం చూపిస్తూ భావోద్వేగానికి గురైన సుధాకర్ రెడ్డి వీడియో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే చంద్రబాబు కేసులో సుధాకర్ రెడ్డి ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు అడిగిన ఆయన.. ప్రతిరోజు టీవీ డిబేట్లో మాట్లాడుతున్నారు. హైదరాబాదు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి ఇక్కడ చెప్పే విషయాలు ఎందుకు కోర్టులో చెప్పరంటే.. దానికి సమాధానం లేదు. ఈయనకు సిఐడి చీఫ్ సంజయ్ తోడు అవుతున్నారు. చెప్పిందే చెప్పినట్టు చంద్రబాబు కేసులో పసలేని విషయాలను బయటపెడుతున్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గారి అసలు రంగును అందరూ చూడండి#ponnavolusudhakarreddy #Ysrcp #ChandrababuArrest pic.twitter.com/lDuLJFmwUa
— AtoZKaburlu (@ramesh_nvl) September 15, 2023