BJP Leader Viral Vedeo : ఆ మధ్యన జబర్దస్త్ లో రాకెట్ రాఘవ సుజాత అంటూ సందడి చేసిన సంగతి తెలిసిందే. తన స్కిట్లో అదే పేరును సంబోధిస్తూ కడుపుబ్బ నవ్విస్తారు. కానీ ఏపీ రాజకీయాల్లో అటువంటి పేరే తరచూ వినిపిస్తోంది. అదే సుకన్య. తాజాగా అటువంటి పేరు ఉన్న మహిళతో గుంటూరు బిజెపి అధ్యక్షుడు చేసిన వీడియో సంభాషణ విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాసలీలల ఎపిసోడ్ లో సుకన్య పేరు మార్మోగింది. ఇప్పుడు తాజాగా అదే పేరు బయటపడుతోంది. గుంటూరు బిజెపి అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ వీడియో కాల్ వ్యవహారం టుమారో రేపుతోంది. ఇందులో ఉన్న మహిళ పేరు సుకన్య.గతంలో అంబటి రాంబాబు రాసలీల వ్యవహారంలో ఇదే పేరు బలంగా వినిపించింది. నరేంద్ర ఆ మహిళతో మాట్లాడుతూ రేపు నాతో వస్తావా అంటూ చేసిన వ్యాఖ్యలు హల్చల్ సృష్టిస్తున్నాయి. రేపు మందు కొడతా.. పోయినసారి మాదిరిగా చేద్దామంటూ చేసిన అసభ్యకర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేనా పవన్ కళ్యాణ్ చెబుతున్న సనాతన ధర్మం అంటూ ప్రశ్నిస్తూ.. పవన్ వ్యాఖ్యలను జత చేస్తూ.. సదరు మహిళతోనరేంద్ర మాట్లాడుతున్న వ్యాఖ్యలనుసోషల్ మీడియాలో పెట్టారు.
* వీడియో హల్ చల్
ఈ వీడియో పై అప్పుడే కొన్ని పార్టీల కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు.ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.ఒంటిపై కాషాయం.. ఒంటిలో కామం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ నేత వ్యవహార శైలిని తప్పుపడుతూ.. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవడం విశేషం.ఇటీవల పవన్ సనాతన ధర్మంపై పెద్ద ఎత్తున మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.దీనికి బిజెపి బలమైన మద్దతు దారుగా నిలుస్తోంది. ఈ క్రమంలో మహిళలతో అసభ్యంగా మాట్లాడడమే సనాతన ధర్మమా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
* అప్పట్లో అంబటి
అయితే అప్పట్లో మాజీమంత్రి అంబటి రాంబాబు రాసలీల వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.అప్పుడు కూడా సుకన్య పేరు మార్మోగిపోయింది.సోషల్ మీడియాకు అప్పట్లో అంబటి టార్గెట్ అయ్యారు.ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులు అప్పుడు వెంటాడారు.ఇప్పుడు అదే గుంటూరుకు చెందిన బిజెపి నేత.. అదే తరహా ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం.
&
సనాతన ధర్మంలో ఇలాంటివి జూజూబీ.. pic.twitter.com/8cCjpxPWa2
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 9, 2024