Homeఆంధ్రప్రదేశ్‌Eluru: తాగిన మైకం.. కన్ను, మిన్ను కానక.. భర్త ఎదుట వివాహితపై ఎంతటి దారుణానికి పాల్పడ్డారంటే..

Eluru: తాగిన మైకం.. కన్ను, మిన్ను కానక.. భర్త ఎదుట వివాహితపై ఎంతటి దారుణానికి పాల్పడ్డారంటే..

Eluru: కోల్ కతా ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి పై హత్యాచార ఘటన మర్చిపోకముందే.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ వివాహిత భర్తతో మద్యం తాగిన కొంతమంది యువకులు.. ఆ తర్వాత అతనిపై దాడి చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. ఏలూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. ఏలూరు నగరంలోని మూడు పోలీస్ స్టేషన్ లకు కొంత దూరంలోనే ఈ ఘటన జరిగింది.

ఏలూరు వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన రెండవ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. 15 రోజుల క్రితమే వీరు ఆ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరూ పగటిపూట ఆ నగరంలోని హోటల్ లో పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో రామకోటి ప్రాంతంలోని కల్చరల్ ఆక్టివిటీస్ నిర్వహించే ఓ వేదికపై పడుకుంటున్నారు. అద్దెకు ఇల్లు దొరకపోవడంతో వారు గత కొద్ది రోజులుగా ఇలానే చేస్తున్నారు.

ఈ దంపతులకు ఏలూరు నగరానికి చెందిన ముగ్గురు యువకులు ఇటీవల పరిచయం అయ్యారు. వారు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పనులు దొరకని సమయంలో ఖాళీగా రోడ్లపై తిరుగుతుంటారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ముగ్గురు యువకులు , విజయరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తితో కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో అటు పక్కనే అతడి భార్య పడుకుంది. మద్యం బాగా తాగిన తర్వాత ఆ ముగ్గురు యువకులు అతనిపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం పక్కనే పడుకుని ఉన్న అతడి భార్యను కొంత దూరం లాక్కుని వెళ్లారు. ఆమె ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం అత్యాచారం చేశారు. వారు చేస్తున్న ఘాతుకాన్ని చూడలేక ఆమె భర్త కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చాడు. అటుగా వెళుతున్న యువకుడికి విషయం చెప్పాడు. ఆ యువకుడు ఆ ఘటన స్థలానికి వెళ్ళగా నిందితులు ముగ్గురు పరారయ్యారు. ఆ బైక్ పై వచ్చిన యువకుడు డయల్ 100 కు కాల్ చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదు. ఆ నెంబర్ కి కాల్ చేస్తే చేస్తాం, చూస్తామని పోలీసులు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం చెబితే.. వారు నిమిషాల్లోనే అక్కడికి వెళ్లారు…

ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఏలూరు వన్ టౌన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. చెంచుల కాలనీకి చెందిన నూతి పల్లి పవన్, లంబాడి పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మారడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నాని ని వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు, సిబ్బంది అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version