https://oktelugu.com/

Alcohol  : మద్యం తాగేటప్పుడు ఇవి తింటున్నారా? డేంజర్లో పడ్డట్లే..

మద్యం లోకి మంచింగ్ కోసం ఏదైనా ఫుడ్ తీసుకోవడం మంచి అలవాటే. అయితే ఇది వెజ్ కంటెంట్ అయితే బెటర్ అని కొందరు ఆరోగ్య నిపుణుల సూచన. ఈ సమయంలో ప్రూట్స్ లేదా నట్స్ వంటివి తీసుకోవడం వల్ల ఎనర్జీ ఉంటుంది. మద్యంలో ఉండే అల్కాహాల్ జీర్ణం కావడానికి చాలా సమయంలో పడుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 18, 2024 / 11:50 AM IST

    Drinking Alcohol

    Follow us on

    Alcohol  ‘మద్యపానం హానికరం’ అని ఎన్ని బోర్డులు కనిపించినా.. మద్యం తాగే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే మద్యంలో ఉన్న సంతోషం మరెందులో లేదని కొందరి అభిప్రాయం. నార్మల్ పీపుల్స్ నుంచి బడా పారిశ్రామిక వేత్తల వరకు వివిధ పద్ధతుల్లో ఎంతో కొంత మద్యం తీసుకుంటూ ఉంటారు. మితంగా మద్యం తీసుకోవడం ఆరోగ్యకరమే. కానీ అతిగా తీసుకుంటే ప్రమాదమే. మద్యం తాగే సమయంలో మంచింగ్ కోసం స్టఫ్ ను తీసుకుంటే ఎనర్జీగా ఉంటుంది. కానీ కొందరు రుచి కోసం నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. మద్యంలోకి నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మంచి మజా ఉంటుందని మద్యం ప్రియుల ఆలోచన. అందుకే చాలా సందర్భాల్లో ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత జరిగేపరిణామాల గురించి తెలిస్తే ఆందోళన చెందుతారు. ఇంతకీ మద్యం తో నాన్ వెజ్ తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

    మద్యం లోకి మంచింగ్ కోసం ఏదైనా ఫుడ్ తీసుకోవడం మంచి అలవాటే. అయితే ఇది వెజ్ కంటెంట్ అయితే బెటర్ అని కొందరు ఆరోగ్య నిపుణుల సూచన. ఈ సమయంలో ప్రూట్స్ లేదా నట్స్ వంటివి తీసుకోవడం వల్ల ఎనర్జీ ఉంటుంది. మద్యంలో ఉండే అల్కాహాల్ జీర్ణం కావడానికి చాలా సమయంలో పడుతుంది. ఇలాంటప్పుడు ఈజీగా డైజేషన్ అయ్యేపదార్థాలు తీసుకోవడం వల్ల ఎనర్జీ ఉండి యాక్టివ్ గా ఉంటారు. అలాగే తక్కువ కాకుండ తగిన మోతాదులో మంచింగ్ కోసం ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు.

    మద్యం తాగే టప్పుడు నాన్ వెజ్ చాల రుచిని ఇస్తాయి. కానీ ఇవి తాత్కాలిక ప్రయోజనాలే అని గుర్తించాలి. మద్యం తాగేటప్పుడు నాన్ వెజ్ తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు ఉంటాయి. ఇవి ఆయిల్ తో కూడుకొని ఉండడం వల్ల త్వరగా జీర్ణం కావు. అంతేకాకుండా నాన్ వెజ్ లో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల కడుపు ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. దీంతో మద్యం తాగిన పీలింగ్ ఉండదు. పైగా మద్యం తో పాటు ఇది తీసుకోవడం వల్ల త్వరగా డైజేషన్ కాకుండా తలనొప్పి వస్తుంది. క్రమంగా వాంతులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మద్యం సేవించేటప్పుడు నాన్ వెజ్ కు దూరంగా ఉండడమే మంచింది.

    కొందరు మద్యం తాగే టప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయిల్ ఫుడ్ వల్ల కడులోని ప్రేగులు అవస్తలు పడుతాయి. దీంతో రాను రాను ఇది మరింత సమస్యగా మారుతుంది. మద్యం ఎంత తీసుకుంటున్నారో.. దానికి మోతాదుగా ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. లేకుంటే ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా కావడం వల్ల శరీరం కంట్రోల్ లో ఉండదు. ఆ తరువాత లివర్ సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల మద్యం తీసుకునే సమయంలో ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.