Andhra Pradesh BJP: ఏపీ( Andhra Pradesh) బీజేపీలో వింత పరిస్థితి కొనసాగుతోంది. పొత్తుతో పదవులు దక్కించుకున్న వారు సైలెంట్ గా ఉంటున్నారు. గతంలో వైసీపీతో అంటగా కి ప్రస్తుత ప్రభుత్వంలో ప్రాధాన్యం లభించని వారు సైతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అయితే తాను బిజెపికి దత్తపుత్రుడునని.. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉన్నా.. బిజెపి తనను విడిచిపెట్టదని అర్థం వచ్చేలా జగన్ ప్రవర్తన ఉంది. జగన్ వైఖరితో బిజెపి విషయంలో టిడిపి తో పాటు జనసేనకు అనుమానం ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీ పై అటాక్ చేయాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏపీ బీజేపీ నేతల వైఖరి చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
* బలం పెరిగినా..
ఏపీ బిజెపికి ( Bhartiya Janata Party) బలం పెరిగింది. ఓట్లతో పాటు సీట్లు పెరిగాయి. 8 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను సైతం కైవసం చేసుకుంది. ఒక కేంద్ర మంత్రి పదవి కూడా బిజెపికి ఉంది. రాష్ట్రంలో కూడా ఒక మంత్రి పదవి తీసుకుంది. కానీ ఏ ఒక్కరూ రాజకీయ ప్రకటనలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఒక్క రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ మాత్రమే మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఆయనే వైసీపీని టార్గెట్ చేసుకునేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనను టార్గెట్ చేసుకునేది. అంతకుమించి పెద్దగా కనిపించేది కాదు. ఇప్పటికీ అదే సత్య కుమార్ యాదవ్ బిజెపి పై మాట్లాడుతున్నారు కానీ.. మరి ఏ ఇతర బిజెపి నేత ముందుకొచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం లేదు. అసలు తెరవెనుక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
* అప్పట్లో వైసీపీకి అనుకూలం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలో ఉన్నప్పుడు బీజేపీలో ఒక వర్గం ఆ పార్టీకి అనుకూలంగా ఉండేది. అనుకూల ప్రకటనలు చేసేది. ఒకానొక దశలో టిడిపి తో పొత్తు వద్దు అని విభిన్న ప్రకటనలు చేసిన నేతలు ఉన్నారు. అటువంటి వారికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస ప్రాధాన్యం లేదు. నామినేటెడ్ పదవుల కేటాయింపు కూడా వారికి జరగలేదు. దీంతో వారు పార్టీలో సైతం అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలుగా ఎన్నికైన వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వర్గం వారే. వారు సైతం నోరు తెరవడం లేదు. వారికి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వేషం ఉంటుంది. అటువంటి వారు కూడా నోరు తెరవకపోవడం నిజంగా విశేషం. సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ వైసీపీని టార్గెట్ చేయాలని సూచించిన వారు నోరు తెరవకపోవడం అనేది నిజంగా విశేషమే.