Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan fan :  పవన్ కోసం 1300 కిలోమీటర్లు.. ఏకంగా కోల్ కత్తాకు.. ఓ...

Pawan Kalyan fan :  పవన్ కోసం 1300 కిలోమీటర్లు.. ఏకంగా కోల్ కత్తాకు.. ఓ అభిమాని సాహసం

Pawan Kalyan fan  : పవన్ కళ్యాణ్ పై అభిమానం వెలకట్టలేనిది. ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ మానియా పతాక స్థాయికి చేరింది. జనసేనకు సాలిడ్ విజయం దక్కడంతో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అంటూ స్లొగన్స్ ప్రజల్లో బలంగా వినిపించాయి.అంతలా మారింది పవన్ పై అభిమానం. చివరకు చిన్న పిల్లలకు సైతం ఆ అభిమానం తాకింది. తాజాగా ఓ యువకుడు అయితే పవన్ కోసం ఏకంగా 1300 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వెలుగులోకి వచ్చింది. పవన్ పై ఉన్న అభిమానంతో విజయవాడ నుంచి కోల్కత్తా కు బయలుదేరాడు ఓ యువకుడు. మార్గమధ్యంలో ఆయన గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. విజయవాడ 60 వ డివిజన్ వాంబే కాలనీ ఈ బ్లాక్ లో నివసిస్తున్న దుర్గా మల్లేశ్వరరావుకు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఏపీ ఎన్నికల్లో పవన్ గెలిస్తే విజయవాడ నుంచి కోల్కతా కాళీమాత ఆలయానికి కాలినడకన వస్తానని మొక్కుకున్నాడు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి డిప్యూటీ సీఎం కావడంతో ఆనందపడ్డాడు. తన అభిమాన హీరో కోసం మొక్కు తీర్చుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈనెల 5వ తేదీన విజయవాడ నుంచి కోల్కత్తా కు కాలినడకన బయలుదేరాడు. ఇప్పటివరకు వేయి కిలోమీటర్ల నడకను పూర్తి చేశాడు. మరో 300 కిలోమీటర్లు నడిచి కోల్కత్తాలోని కాళీమాతను దర్శించుకోనున్నాడు.

* తాను ఏదీ ఆశించి చేయలేదు
అయితే మార్గమధ్యంలో ఒడిస్సా ప్రాంతంలో స్థానికులు ఇతనిని పలకరించారు. కాలినడక ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కాళీమాతను దర్శించుకున్న తర్వాత.. తాను అభిమానించే పవన్ కళ్యాణ్ ఒకసారి కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరికగా ఉందని.. తాను ఏమీ ఆశించి ఇలా పాదయాత్ర చేయలేదని.. కేవలం పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఇలా చేశానని చెప్తున్నారు.

* అభిమానానికి ఎల్లలు లేవు
గతంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సంబరాలు చేసుకున్నారు. అయితే పవన్ అభిమానులకు ఎల్లలు లేవు. ఆయనకు ఒడిస్సా తో పాటు కర్ణాటక తమిళనాడులో సైతం అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను అభిమానించేవారు దేవాలయాల సందర్శనకు కాలినడకన వెళుతుండడం విశేషం. అయితే ఏపీలో పవన్ పై ఉన్న అభిమానాన్నిచూస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు మాత్రం ఫిదా అవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version