spot_img
Homeఆంధ్రప్రదేశ్‌21 Visakhapatnam Yoga Event: విశాఖపై అంతర్జాతీయ ముద్ర.. మోదీ ప్రాధాన్యం వెనుక!

21 Visakhapatnam Yoga Event: విశాఖపై అంతర్జాతీయ ముద్ర.. మోదీ ప్రాధాన్యం వెనుక!

21 Visakhapatnam Yoga Event: అంతర్జాతీయ స్థాయిలో( International) మరోసారి విశాఖపట్నం మార్మోగ నుంది. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐదు లక్షల మందితో యోగా దినోత్సవ వేడుకలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖ సిటీ పర్యాటకంగా గుర్తింపు పొందింది. వాణిజ్యపరంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగాసిటీగా గుర్తింపు సాధించింది. అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ గా పేర్కొంటారు. ఇక టూరిజం అంటే విశాఖ అని అంతర్జాతీయ పర్యాటకులు భావిస్తారు. అటువంటి చోట ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరుపుతుండడంతో.. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విశాఖ చర్చకు దారితీస్తోంది.

Also Read: PM Modi Vizag Yoga Day: ఏపీకి ప్రధాని మోదీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

యోగాతో అంతర్జాతీయ ఖ్యాతి
యోగాకు( yoga) ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చింది భారత్. అందుకే యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి విశాఖలో జరిగే వేడుకలకు హాజరవుతానని ముందుగానే ప్రకటించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మోడీ.. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సాగర తీరానికి వస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే విశాఖ అభివృద్ధికి అడుగులు పడినట్టే. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతున్న క్రమంలో ఇటువంటి అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలవడం శుభపరిణామం.

షెడ్యూల్ ప్రకటన
ప్రధాని విశాఖ పర్యటనకు( Visakha tour) సంబంధించి షెడ్యూల్ ముందుగానే ఖరారు అయింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తరువాత రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖ బీచ్ రోడ్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అదేరోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Also Read: Visakhapatnam : విశాఖలో ఐదు లక్షల మందితో యోగా ఈవెంట్!

ప్రముఖుల తాకిడి
ప్రధాని మోదీ ( Prime Minister Narendra Modi)పర్యటన నేపథ్యంలో విశాఖకు ప్రముఖుల తాకిడి పెరిగింది. ఇప్పటికే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆయన ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ నేరుగా విశాఖకు చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఒకరోజు ముందుగానే విశాఖ నగరం భద్రత వలయంలోకి వెళ్తుంది. ఇప్పటికే నగరం నిఘా నీడలో ఉంది. మొత్తానికైతే విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి రావడం పై నగరవాసులతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version