Chandrababu vs Achchenna Yoga: విశాఖలో( Visakhapatnam) ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని ఉన్నారు. ఈనెల 21న యోగా దినోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. అక్కడ రాత్రి బస చేసి.. ఉదయం యోగా దినోత్సవం లో పాల్గొనున్నారు. దాదాపు 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ క్రమంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. అయితే సీనియర్ మంత్రిగా ఉన్న అచ్చెనాయుడు ఓ అంశంపై మాట్లాడుతుండగా.. సెటైర్లు వేశారు చంద్రబాబు. ఏకంగా యోగా డేకు రావద్దని మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి.
బీసీ మంత్రి అచ్చెన్న నాయుడుకి షాక్!
నువ్వు ఆకాశంలో ఉన్నావ్, నువ్వు కూడా యోగ దినోత్సవానికి రాకపోతేనే బెటర్
– సీఎం చంద్రబాబు నాయుడు #ChandrababuNaidu #InternationalDayOfYoga2025 #Vizag #Visakhapatnam #UANow #AndhraPradesh pic.twitter.com/SAumFgcnxU
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) June 17, 2025
మంత్రులతో సమీక్ష
విశాఖ యోగా దినోత్సవానికి( yoga day ) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అధికారులతో పాటు మంత్రులతో సమీక్ష జరిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా బస్సుల్లో యోగాభ్యాసకులను ఎలా తీసుకురావాలి? వారికి కేటాయించిన సీట్లలో ఎలా కూర్చోబెట్టాలి? బస్సులు ఎన్ని అవసరం అవుతాయి? వంటి విషయాల మీద చంద్రబాబు చర్చించారు. ఇంతలో మంత్రి అచ్చెనాయుడు జోక్యం చేసుకున్నారు. ఏయే బస్సుల్లో ఎవరు ఎక్కుతారు? అనేసరికి చంద్రబాబు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఏ బస్సులో ఎవరు ఎక్కడం ఏంటి అని ప్రశ్నించారు. ఎవరు పడితే వారు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రతిష్టాత్మకమైన యోగా డేకు ఎలా వస్తారని నిలదీసినంత పని చేశారు చంద్రబాబు. నెలరోజులపాటు సచివాలయం కేంద్రంగా యోగభ్యాసకులకు ప్రాక్టీస్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి వారే వస్తారని.. వారందరికీ ప్రత్యేకంగా నెంబర్ ఇస్తారని.. వారికి కేటాయించిన చోటులో మాత్రమే వారు కూర్చోవాలని.. ఏ ప్రాక్టీస్ చేయకుండా నేరుగా బస్సులు ఎక్కి వస్తామంటే కుదరని పనిగా తేల్చేశారు.
Also Read: Chandrababu : చంద్రబాబు కొత్త రికార్డు!
వరుసగా సెటైర్లు..
మరోవైపు మంత్రి అచ్చెనాయుడు పై( Minister Achan Naidu ) సెటైర్లు పేల్చారు చంద్రబాబు. ఈ విషయాల మీద అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నీవు కూడా యోగ ప్రాక్టీస్ చేయకపోతే దయచేసి రావొద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. యోగా డేనాడు తలో రకం చేస్తే అది వార్తల్లో ప్రధాన అంశంగా మారిపోతుందని… మొత్తానికి ఎసరు వస్తుందని అన్నారు చంద్రబాబు. అక్కడ ఒక క్రమ పద్ధతి ప్రకారం జరగాలని చంద్రబాబు గుర్తు చేశారు. యోగ ప్రాక్టీస్ లేకపోతే అచ్చెన్న నీవు రావద్దు అని చంద్రబాబు అనేసరికి అక్కడ నవ్వులు విరిశాయి. అయితే చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్ తో ఇప్పుడు అందరి దృష్టి అచ్చెన్న పై ఉంటుంది. యోగా డే నాడు కచ్చితంగా మీడియా ఫోకస్ సైతం ఆయన పైనే ఉంటుంది. మరి ఆయన ఆరోజు యోగా దినోత్సవానికి వస్తారో? లేదో? చూడాలి.