https://oktelugu.com/

Amaravati: అమరావతికి రూ.11 వేల కోట్లు.. ముంబై నుంచి గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్. అమరావతికి( Amravati ) భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది మరో సంస్థ.

Written By:
  • Dharma
  • , Updated On : January 22, 2025 / 05:55 PM IST
    Amaravati(2)

    Amaravati(2)

    Follow us on

    Amaravati: అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిధుల విడుదలకు ముందుకు వచ్చింది. బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఈ నిధులు అందించేందుకు నిర్ణయించింది. తొలి విడతగా మూడు వేల కోట్లు విడుదలకు ప్రపంచ బ్యాంకు అంగీకరిస్తూ లేఖ రాసింది. మరి కొద్ది రోజుల్లో పనుల ప్రారంభానికి అన్ని రకాల కసరత్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హడ్కో ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( హడ్కో) ఈరోజు ముంబైలో సమావేశం అయింది. సంబంధిత బోర్డు సమావేశంలో అమరావతికి 11 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేయాలని డిసైడ్ అయ్యింది. సంప్రదింపులు తర్వాత హడ్కో రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.

    * భారీగా నిధుల సమీకరణ
    అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణం ఎక్కడ నిలిచిపోయిందో.. అక్కడి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకోవైపు భారీగా నిధులు సమకూరుతున్నాయి. ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం ప్రతినిధులు స్థానికంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేశాయి. రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మిగతా ఆర్థిక సంస్థలు సైతం సాయం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.

    * గత అనుభవాల దృష్ట్యా
    గత అనుభవాల దృష్ట్యా.. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం( central government) సైతం రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. అమరావతి తో అనుసంధానిస్తూ కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులతో పాటు.. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏకకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

    * ప్రైవేటు సంస్థలు సైతం అమరావతిలో( Amaravathi ) ప్రైవేటు సంస్థల ఏర్పాటు సైతం చురుగ్గా చేపట్టాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. గతంలో చాలా సంస్థలు తమ కార్యకలాపాలను మొదలు పెట్టేందుకు సిద్ధపడ్డాయి. కానీ అప్పట్లో వైసీపీ సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అడుగులు పడుతున్నాయి. దీంతో సదరు సంస్థలు సైతం తమకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నాయి. మొత్తానికైతే అమరావతి రాజధానికి ఒక మహర్దశ వచ్చినట్టే.