Homeఅంతర్జాతీయంIran US Peace Talks Failure Pakistan: అసలే పాకిస్తాన్.. అక్కడ శాంతి ఎలా పుడుతుంది.....

Iran US Peace Talks Failure Pakistan: అసలే పాకిస్తాన్.. అక్కడ శాంతి ఎలా పుడుతుంది.. ఇరాన్, అమెరికా మరో వేదిక వెతుక్కోవాల్సిందే..

Iran US Peace Talks Failure Pakistan: కార్యానికి బలమైన ముహూర్తం.. కర్మకు మంచి వేదిక కావాలి అంటారు. ఎందుకంటే బలమైన ముహూర్తంలో చేపట్టే కార్యం విజయవంతం అవుతుంది. మంచి వేదిక మీద నిర్వహించే కర్మ గొప్పగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో అనుభవంతో పెద్దలు పై మాట చెప్పారు. అందువల్లే మనవాళ్లు ఏదైనా పని చేపట్టాలంటే ముహూర్తం చూసుకుంటారు. గొప్ప కార్యం చేయాలంటే ఘనమైన వేదిక ఉండాలని భావిస్తుంటారు.

ఇది మనకు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇరాన్, అమెరికా యుద్ధం సాగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం కాల్పుల విరమణకు ఓకే చెప్పుకున్నాయి. మధ్యలో పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ రంగ ప్రవేశంతో అపశకునం వినిపించింది. ఎందుకంటే సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత.. ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. కాళరాత్రి అంటే ఏమిటో చూపించింది. దీంతో పాకిస్తాన్ మీద విమర్శలు మొదలయ్యాయి. అసలు ఆ దేశం మధ్యవర్తి పాత్ర పోషించకుండా ఉండి ఉంటే బాగుండేదని విశ్లేషణలు వ్యక్తమయ్యాయి.. ఇదంతా జరుగుతూ ఉండగానే క్రెడిట్ కోసం పాకిస్తాన్ పాలకులు తెగ తాపత్రయపడ్డారు. పెయిడ్ మీడియా సంస్థల్లో గొప్పగా కథనాలు రాయించుకున్నారు.

ఆదివారం పాకిస్తాన్ కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుపుతామని.. యుద్ధానికి ముగింపు ఇస్తామని పాకిస్తాన్ పరిపాలకులు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. చివరికి ఆరోజు రానే వచ్చింది. ప్రత్యేక విమానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్.. ఇరాన్ ప్రతినిధులు హాజరయ్యారు. సుదీర్ఘంగా ఈరు దేశాల అధినేతల మధ్య చర్చలు జరిగాయి. ఇరాన్ చెప్పింది అమెరికా వినిపించుకునే స్థితిలో లేదు. అమెరికా వినకపోతే తాము కూడా చేసేది ఏమీ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇలా ఎవరి అహాలకు వారు వెళ్ళిపోయారు. కనీసం చెప్పే మాటలను వినే ఇరు దేశాల ప్రతినిధులకు లేకపోవడంతో విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో అర్ధాంతరంగా ఈ చర్చల ప్రక్రియ ముగిసింది. ఇది అమెరికాకు చెడు వార్త అని వాన్స్ ప్రకటించారు. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా ఒత్తిడి చేయడం వల్లే తాము అంగీకరించలేదని ఇరాన్ ప్రకటించింది.

శాంతి చర్చల ప్రక్రియ ఎటువంటి ఫలితం లేకుండా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో.. ఒక్కసారిగా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పాకిస్తాన్ కేంద్రంగా శాంతి ఎలా సాధ్యమవుతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నిత్యం ఉగ్రవాదుల కదలికలతో ఉగ్ర భూమిగా మారిపోయిన పాకిస్తాన్లో శాంతిస్థాపన ఎలా సాధ్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఇరు దేశాల ప్రతినిధులను పిలిచినప్పుడు.. వారి మధ్య సామరస్య వాతావరణం సృష్టించడానికి పాకిస్తాన్ పాటుపడాల్సి ఉండేది. అలా కాకుండా జస్ట్ హోస్ట్ పాత్రకే పరిమితం కావడంతో ఉపయోగం లేకుండా పోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular