NTR director: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లకి సక్సెస్ లు ఇచ్చిన దర్శకులను కొద్దిరోజుల తర్వాత మర్చిపోతుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు తమ టాలెంట్ ని చూపించి సక్సెస్ ను సాధించిన వాళ్లకు మాత్రమే ఇక్కడ ఎక్కువ గుర్తింపైతే ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు మనకు సక్సెస్ లను అందించిన దర్శకులు ప్లాపుల్లో ఉన్నా కూడా వాళ్లకు అవకాశాలను ఇచ్చేంత గొప్ప మనసు ఉన్న హీరోలైతే ఎవరూ ఉండరు. ఒకవేళ వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉన్నా కూడా వాళ్ల మార్కెట్ తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో ఎవరికి వారు సక్సెసుల్లో ఉన్న దర్శకుల వైపే అడుగులు వేస్తారు తప్ప ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళని ఎవరూ పట్టించుకోరు…ఇక ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో ‘బాల రామాయణం’ అనే సినిమా చేసి తనకి సూపర్ సక్సెస్ ని అందించిన డైరెక్టర్ గుణశేఖర్…
ఆ తర్వాత ఆయన చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అనుష్క తో ఆయన చేసిన ‘రుద్రమదేవి’ సినిమాలో ‘గోన గన్నారెడ్డి’ క్యారెక్టర్ కోసం ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించారట. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నేను ఆ పాత్రను చేయలేనని చెప్పినట్టుగా అప్పట్లో పలు వార్తలైతే వచ్చాయి. నిజానికి ఎన్టీఆర్ కి ఆ పాత్ర బాగా సెట్ అయ్యేది. అయినప్పటికి తను చేయడానికి ఆసక్తి చూపించలేదు.
కారణం ఏంటంటే గుణశేఖర్ కి అంతకుముందు అన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కాబట్టి తను ఆ పాత్రను చేయలేకపోయాడు అంటూ కొన్ని విమర్శలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే ఆ పాత్రను అల్లు అర్జున్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్లో ఆయన మాట్లాడిన విధానం కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది…
మొత్తానికైతే తనకు సక్సెస్ ని అందించిన దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకోలేదని ఎన్టీఆర్ తో గుణశేఖర్ వేరే సినిమా చేయాలని చూసినా కూడా అతనికి అవకాశం ఇవ్వలేదంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు…ఇక ప్రస్తుతం గుణశేఖర్ ఒక చిన్న సినిమా చేస్తున్నాడు ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తే ఆయనకి గొప్ప గుర్తింపైతే వస్తోంది…మరోసారి ఆయన కంబ్యాక్ ఇస్తాడు…దాంతో స్టార్ హీరోలనుంచి కూడా పిలుపు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…