Jagdish Patani: ‘లోఫర్’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన హీరోయిన్ దిశా పటాని(Disha Patani), ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో పెద్దగా సూపర్ హిట్ సినిమాలు లేవు కానీ, చాలా కాలం తర్వాత ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ‘కల్కి 2898 AD’ చిత్రం తో మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో రీసౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకొని వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక సోషల్ మీడియా లో దిశా పటాని కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలకు కుర్రాళ్ళ నుండి మాస్ రెస్పాన్స్ వస్తూ వస్తుంది. ప్రతీ పోస్ట్ కి లైక్స్ మిలియన్ల సంఖ్యలో ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా దిశా పటాని తండ్రి జగదీశ్ పటాని ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో ఉన్న తన పూర్వీకుల నివాసం పై ఈమధ్య కాలంలోనే కొంతమంది గ్యాంగ్ స్టర్ల ముఠా ఎటాక్ చేశారు. దీంతో రీసెంట్ గానే ఆయన భద్రతా కోసం ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నేడు ఆయన గన్ కి లైసెన్స్ ని మంజూరు చేస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. జగదీశ్ పటాని ఒక రిటైర్డ్ DSP అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన పెద్ద కూతురు కూడా ఆర్మీ లో పని చేసి వచ్చింది. కేవలం దిశా పటాని మాత్రమే సినీ రంగాన్ని ఎంచుకుంది. ఈ దాడి గురించి మరికొన్ని వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ 11,12 తేదీల్లో బరేలీలోని జగదీశ్ పటానీ ఇంటిపై మోటార్ సైకిల్ పై వచ్చిన కొంతమంది దుండగులు సుమారుగా 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ కి చెందిన సబ్యులని పోలీసులు దర్యాప్తు లో గుర్తించారు.