India Missiles: పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ వరకు ప్రతిదీ కూడా శత్రుదేశమే. చైనా నుంచి మొదలు పెడితే అమెరికా వరకు మన వినాశనాన్ని మాత్రమే కోరుకునే దేశాలే. పైగా ఇవి మన చుట్టూ ఉన్న దేశాలకు ఆర్థికంగా అండగా ఉంటాయి. మనల్ని ఇబ్బంది పెడుతూ నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటువంటి క్రమంలో యుద్దాల వంటివి వస్తే భారత్ బలమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ దేశాలకు మించిన సైనిక సామర్థ్యాన్ని.. అస్త్రాల సామర్థ్యాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారత్ రక్షణ పరంగా ఎన్నో అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ అదే అద్భుతాలను చేస్తోంది.
ఒకప్పుడు సైనికులు యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు మిస్సైల్స్ ఆ పాత్రను పోషిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో మనం సైనికులకు పెద్దగా పని కల్పించకుండా మిస్సైల్స్ ద్వారా పనిచేశాం. పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మొత్తం నేలమట్టం చేశాం. ఒక రకంగా ఆపరేషన్ సిందూర్ మన దేశానికి సంబంధించిన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు చూపించింది. ఇక్కడితోనే భారత్ ఆగిపోలేదు. తన అస్త్రాలను మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. దీనికి చైనా తయారు చేసిన పిఎల్ 15 సహకరిస్తోంది.
పి ఎల్ 15 పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్. లేకపోతే అది విజయవంతం కాలేదు. అది మన భూభాగంలో పడడంతో బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దానిని అనేక రకాలుగా పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు మన మిస్సైల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆధునిక వ్యవస్థలను మిస్సైల్స్ లో రూపొందిస్తున్నారు.
గగనతలం నుంచి గగనతలంలోకి టార్గెట్ ఫినిష్ చేయడానికి భారత్ మిస్సైల్స్ రూపొందిస్తోంది. ఇందులో బాగానే అస్త్ర మార్క్ 1 అనే మిస్సైల్ ను రూపొందించింది. ఇది 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఫినిష్ చేయగలరు. అయితే దీనిని మరింత డెవలప్ చేసి అస్త్ర మార్క్ 2 ను అందుబాటులోకి తీసుకొస్తోంది భారత్. ఇందులో అత్యధిక చోదక శక్తి ఉంది. టార్గెట్ ను త్వరగా గుర్తించడం.. అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం వంటి వాటిని ఇందులో ఏర్పాటు చేస్తోంది. చైనా మిస్సైల్ ద్వారా సేకరించిన సమాచారాన్ని భారత శాస్త్రవేత్తలు ఇందులో పొందుపరుస్తున్నారు.
చైనా మిస్సైల్ లోని ఏఈ ఎస్ ఏ రాడార్ మన సైంటిస్టులకు ఆసక్తికరంగా అనిపించింది. అందువల్లే దీని ద్వారా రాడార్ ఆధారమైన కోడింగ్ విధానాలను గుర్తించే విధంగా మిస్సైల్ రూపొందిస్తున్నారు. అంతేకాదు సెల్ఫ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆల్గారిదం, నేషనల్ యాక్టివ్ ఆర్డర్ సీకర్ ను మెరుగుపరుస్తున్నారు. మిస్సైల్, డాటా లింక్, ఎన్క్రిప్షన్ ను డెవలప్ చేస్తున్నారు. చైనా మిస్సైల్ డిజైన్ ప్రకారం అస్త్ర మార్క్ 2 లో కౌంటర్ కౌంటర్ మెజర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రానిక్ జామింగ్ అనేది ఇబ్బంది పెట్టదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఈ మిస్సైల్ రూపకల్పనలో చైనా, అమెరికాను మించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.