Sagar Daryani: కొందరు వైఫల్యాల నుంచి విజయాలు సాధిస్తారు. మరికొందరు అవమానాల నుంచి గెలుపులను సొంతం చేసుకుంటారు. ఇంకొందరు పేదరికం నుంచి పాఠాలు నేర్చుకుని విజయ సోపానాలుగా మలచుకుంటారు. కానీ ఇతడు మాత్రం వారందరి కంటే పూర్తి భిన్నం.. ఇతడికి కష్టాలు అంతగా ఎదురు కాలేదు. ఇబ్బందులు కూడా ఎదురు కాలేదు.. కానీ ఒక వైఫల్యం అతడిని పూర్తిగా మార్చేసింది. ఏకంగా 3 వేల కోట్లకు అధిపతిని చేసింది.
అతడి పేరు సాగర్. ఉండేది కోల్ కతా లో.. అందరి మాదిరిగానే ఉన్నత చదువులు చదివాడు. కళాశాల విద్యలో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కొంతకాలం ఇద్దరి మధ్య కథ సజావు గానే సాగింది. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంతో అతడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఫైనల్ ఇయర్ పరీక్షలు వచ్చేసాయి. ఆ బాధలో అతడు పరీక్షలు సరిగ్గా రాయలేడేమోనని స్నేహితులు ఊరడించేవారు. కుటుంబ సభ్యులు దగ్గరకు తీసుకొని ప్రేమతో మాట్లాడేవారు. అదే క్రమంలో స్నేహితులు మ్యాగీలు, పిజ్జాలు, బర్గర్లు తెప్పించుకొని అతడికి తినిపించేవారు. అదే సమయంలో మోమో లు కూడా తెప్పించేవారు గాని.. వాటికి ఎటువంటి బ్రాండ్ ఉండేది కాదు. దీంతో అది సాగర్ ను ఆలోచనలో పడేసింది.. పైగా సాగర్ స్నేహితుల్లో వినోద్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నేపాలి ప్రాంతానికి చెందినవాడు.. అతనితో తరచూ సాగర్ మోమోల గురించి చర్చించేవాడు. ఆ తర్వాత సాగర్ తనే మోమోల వ్యాపారం లోకి రావాలి అనుకున్నాడు. ఇదే విషయాన్ని తండ్రితో చెప్తే ఒప్పుకోలేదు. అప్పటికి సాగర్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి డిప్రెషన్ లో ఉండడంతో అతని తండ్రి అతి కష్టం మీద 30,000 ఇచ్చాడు. దీనికి వినోద్ సహకారం కూడా తీసుకునేవాడు.
ఆ 30 వేల తో మోమో లు తయారు చేయడం సాధ్యం కాదని సాగర్ కు తెలిసినప్పటికీ.. ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అప్పటికి అతడు బీకాం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశాడు. ఫలితాల కోసం ఎదురు చూడకుండా.. మోమోలు తయారు చేయడం మొదలు పెట్టాడు. ఉదయాన్నే లేవడం.. కష్టపడి మెమో లు తయారు చేయడం.. వాటిని విధి చివర్లో అమ్మడం మొదలుపెట్టాడు.. చూసిన వాళ్లు మాత్రం అతడిని ఎగతాళి చేసేవారు. అప్పటికే సాగర్ కుటుంబానికి వంశపారంపర్యంగా వస్త్రాలు ఆమె దుకాణం ఉండడంతో.. అప్పుడప్పుడూ అక్కడ కూర్చునేవాడు. ఆ తర్వాత తమ దుకాణానికి ఎదురుగా ఉన్న స్పెన్సర్స్ మాల్ లో ఓ చిన్నపాటి కియోస్క్ ను అద్దెకు తీసుకున్నాడు. రోజుకు ఒక గంట పాటు పనిచేసేలాగా షెఫ్ ను ఒప్పించాడు.. ఆ తర్వాత తాను తయారుచేసిన మెమో లకు విస్తృతంగా బ్రాండింగ్ కల్పించాడు. పసుపు రంగు దుస్తులు ధరించి తనను తయారుచేసిన మోమో లను పట్టుకొని తెగ ప్రచారం చేసేవాడు. పసుపు రంగు దుస్తులు ధరించి అందరికీ ఇచ్చేవాడు. ఇదే సమయంలో సాగర్, వినోద్ కు బ్యాంకు ఉద్యోగాలు వచ్చినప్పటికీ వెళ్ళలేదు. వ్యాపారాన్ని మాత్రమే చేయాలనుకుని అతడు ఇందులోకి దిగాడు.
స్పెన్సర్ మాల్లో కియోస్క్ అనుభవంతో.. అనేక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కియోస్కులు అద్దెకు తీసుకున్నాడు. తన బ్రాండ్ ద్వారా వచ్చే మోమో స్ ను ప్లేటు 90 రూపాయలకు విక్రయించేవాడు. వాస్తవానికి వీధులలో మోమో లు 30 రూపాయలకే లభించేవి.. మొదట్లో సాగర్ విక్రయించే మోమోస్ ను ఎక్కువ ధర అని ఎవరూ కొనేవారు కాదు. అయితే అతడు తయారు చేస్తున్న విధానం.. మార్కెటింగ్ స్ట్రాటజీ ఆకట్టుకోవడంతో అమ్మకాలు పెరిగిపోయాయి.
మోమో స్ లో అతడు 50 వెరైటీలను అందుబాటులోకి తెచ్చాడు.. కోవిడ్ సమయంలో ఇబ్బంది ఎదురైనప్పటికీ.. తమ ఉత్పత్తులను ఇంటింటికి చేర్చుకునేలా ప్రణాళిక రూపొందించాడు. ప్రస్తుతం సాగర్ సంస్థ దేశంలోని 75 నగరాల్లో 750 ఔట్ లెట్ లలో విక్రయాలు చేపడుతోంది. సుమారు 6000 మంది ఉద్యోగులు సాగర్ నెలకొల్పిన సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ విలువ ప్రస్తుతం 3,000 కోట్లకు చేరుకుంది. అన్నట్టు ఇతడి సంస్థ పేరు వావ్.. ప్రేమికురాలు కారణం లేకుండానే బ్రేకప్ చెప్పింది. కోవిడ్ అవకాశాలను గల్లంతు చేసింది. ఈ రెండిటి నుంచి సాగర్ విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. ఏకంగా మూడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు.