Tollywood Heroes: హీరోలు ఎంతమేరకు రిస్క్ తీసుకుంటారు ? అనే అంశం బట్టే కొత్త కథలు వెండితెర పైకి వస్తాయి. అదేంటో మన తెలుగు హీరోలకు రిస్క్ అంటే భయం. తమిళ హీరో సూర్య ‘జై భీమ్’ సినిమా తీస్తే మెచ్చుకుంటారు గానీ, తాము ప్రేరణ పొంది అలాంటి కొత్త కథలను, విభిన్న చిత్రాలను చేయాలని మన స్టార్ హీరోలకు ఆలోచన కలగదు. ఎందుకయ్యా అంటే ? ఏం చెబుతాం.. మన హీరోలకు కమర్షియల్ సినిమాలు అంటేనే నమ్మకం.

కానీ, రిస్క్ లేనిది గొప్ప విజయం రాదు అని అర్థం చేసుకోరు. రిస్క్ కి తెలుగులో సాహసం అనే పదం ఉంది. పాతాళభైరవి సినిమాలో “సాహసం సేయరా డింభకా” అన్న డైలాగ్ చాలా పాపులర్ కూడా. ఆ డైలాగ్ ను సీనియర్ ఎన్టీఆర్ నుంచి కృష్ణ వరకు పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారు. అందుకే వాళ్ళ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు ఉన్నాయి.
ఏ… సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ కంటే గొప్ప స్టార్ హీరోలా ఇప్పుడున్న హీరోలు ? జీవితంలో ప్రతి హీరో ఏదో ఒక కథ విషయంలో కనీసం ఒక్క సాహసం అయినా చేయాలి. అయినా మనోళ్లు మంచి కథల విషయంలో రిస్క్ చేయరు. కమర్షియల్ సినిమాల విషయంలో మాత్రం బోలెడు రిస్క్ లు చేస్తారు. దాన్నే నెగెటివ్ రిస్క్ అంటారు.

రిస్క్ లో పాజిటివ్ ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది. ఒక స్టూడెంట్ స్టేజ్ ఎక్కే సాహసం చేయకపోవటానికి కారణమైన తన భయంతో పోరాడి, చివరకు స్టేజ్ ఎక్కి గొప్ప స్పీచ్ ఇస్తే.. ఆ స్టూడెంట్ పేరెంట్స్ కి ఎలా ఉంటుందో… అదేవిధంగా మన హీరోలు కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా మంచి మ్యాటర్ ఉన్న కొత్త కథలను దైర్యంగా సెలెక్ట్ చేసుకుని మంచి సినిమాలు చేస్తే.. ప్రేక్షకులకు కూడా ఆ స్టూడెంట్ పేరెంట్స్ లానే సంబర పడతారు.
Also Read: మొదటి సినిమాతోనే హిట్ కొట్టి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలు, హీరోయిన్లు వీరే !
అందుకే, పాజిటివ్ రిస్క్ ఎప్పుడు విజయానికి పునాది లాంటిది. ఇప్పటికైనా మన హీరోలు రిస్క్ చేయాలని, మంచి మంచి కథలను తెరపైకి తీసుకు రావాలని కోరుకుందాం. చివరకు ఓ పెద్దాయన చెప్పిన మాట చెప్పాలనిపిస్తుంది. ‘మనం గెలవక పోవటానికి కారణం మన శక్తిని తక్కువ అంచనా వేసుకోవటం. మనం ఓడిపోవటానికి కారణం మన శక్తిని ఎక్కువ అంచనా వేసుకోవటం’. కాబట్టి.. హీరోలూ ఇకనైనా సరైన అంచనాతో రిస్క్ తీసుకోండి.
Also Read: మన హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే మంచిది !