Jr NTR Slogans: జూనియర్ ఎన్టీఆర్ పేరు ఈ మధ్య రాజకీయంగా బాగా వినిపిస్తోంది. ఆ వినికిడికి తారక్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎంత లేదు అనుకున్నా టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. వాళ్లల్లో వాళ్లకు తేడా రావాలి. అలా రావాలి అంటే.. బాబు నాయకత్వానికి పోటీ ఉండాలి. బాబు అంటే నెగివిటీ పెరగాలి. అలా పెరగాలి అంటే.. ఒక్క జూనియర్ ఎన్టీఆరే కనిపిస్తున్నాడు.

అందుకే, తారక్ పేరును వాడుకుంటుంది వైసీపీ. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో బాబు ముందే.. ‘బాబులకే బాబు తారక్ బాబు’ అంటూ కొందరు హల్ చల్ చేశారు. వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు అని ప్రచారం చేశారు. కానీ వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు కాదు. వైసీపీ అభిమానులు అని టాక్ నడుస్తోంది. అయితే, వైసీపీ అభిమానులు అయితే.. వాళ్ళు ‘సీఎం సీఎం.. ఎన్టీఆర్ సీఎం..’ అంటూ ఓ రేంజ్ లో ఎందుకు రచ్చ చేస్తారు ?
మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. ప్రస్తుతానికి అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు బాగా దూరంగా ఉంటున్నాడు. అలాగే టీడీపీకి చంద్రబాబుతో కూడా అంటీముట్టనట్టుగానే ఉంటూ తన సినిమాలేవో తానూ చేసుకుంటూ ముందుకుపోతున్నాడు. కానీ, ఎన్టీఆర్ సన్నిహితులు కారణంగా తారక్ పేరు పదే పదే రాజకీయాల్లో వినిపిస్తోంది.

వాళ్ళు ఎన్టీఆర్ కి మేలు చేసున్నారా ? లేక మానసిక క్షోభకు గురి చేస్తున్నారా ? అని ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. వాళ్ళ కారణంగా చంద్రబాబు ఏడుపు సీన్ లో, భువనేశ్వరి పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్ లో తారక్ ను విలన్ ను చేశారు టీడీపీ నాయకులు. ఎన్టీఆర్ ను టీడీపీ అభిమానుల చేతే తిట్టించారు. దీంతో సహజంగానే ఎన్టీఆర్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ కు బాధ కలిగింది.
Also Read: టీడీపీ నేతలకు జూ.ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? అసలు కథేంటి?
అందర్నీ కలుపుకుపోవాలి అనే ఆలోచనా విధానంతో ఉన్న ఎన్టీఆర్ కి, ఈ అనుచిత వ్యాఖ్యల అలజడి అవసరమా ? అసలు ఎవరో కామెంట్లు చేయడం ఏమిటి ? ఎన్టీఆర్ ని అణగదొక్కాలి, ఎన్టీఆర్ సినిమాలు చూడకూడదు అని టీడీపీ క్లోజ్ సర్కిల్స్ లో మెసేజ్ లు పంపడం ఏమిటి ? ఏది ఏమైనా ఈ రాజకీయాల వల్ల ఎన్టీఆర్ కి భవిష్యత్తులో ఏం వస్తోందో తెలియదు గానీ, ఇప్పుడు అయితే, కెరీర్ నష్టమే చేస్తోంది.
Also Read: ఎన్టీఆర్ ప్రియుశిష్యులైన కొడాలి నాని, వంశీకి విభేదాలు ఎక్కడ వచ్చాయి? ఎందుకు విడిపోయారంటే?
ఇప్పటికైనా ఎన్టీఆర్ సన్నిహితులు, అభిమానులంతా ఓ సారి జరుగుతున్న పరిణామాలను ఆలోచించి.. సరైన దారిలో తమ హీరో ఇమేజ్ ను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే తారక్ కెరీర్ కి మేలు జరుగుతుంది.