Rashmi Gautam
Rashmi Gautam: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ కి సోషల్ మీడియా వేధింపులు ఎక్కువయ్యాయి. ఒక్క సంఘటన ఆమెను విమర్శలపాలు చేస్తుంది. తన సిద్ధాంతాన్ని తప్పుబడుతూ కొందరు ఆధారాలు సేకరించి మరీ ఏకిపారేస్తున్నారు. రష్మీ గౌతమ్ యానిమల్ లవర్ అన్న విషయం తెలిసిందే. ఆమె మూగ జీవాలను హింసించ వద్దంటూ క్యాంపైన్ చేస్తుంటారు. జీవహింసకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ… ఇది నేరమని ప్రశ్నిస్తారు. కుక్కలు, ఆవులు వంటి మూగజీవాలను ఎవరు హింసిస్తున్నా ఖండిస్తారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తుంటారు. మూగజీవాలపై ప్రేమతో రష్మీ వీగన్ గా మారారు.
వీగన్ అంటే… మాంసాహారమే కాదు జంతువుల ఉత్పత్తులైన గుడ్లు, పాలు, పాలతో తయారు చేసే ప్రొడక్ట్స్ కూడా తినరు. పాల కోసం ఆవులు, గేదెలను హింసిస్తున్నారనేది వీగన్స్ ఆరోపణలు. కాగా రష్మీ గౌతమ్ గతంలో ఒక ఐస్ క్రీం పార్లర్ ఓపెనింగ్ కి వెళ్లారు. ఆ బిజినెస్ ని ప్రమోట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు తీసిన ఓ నెటిజన్.. దీనికి నీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. పాలు లేకుండా ఐస్ క్రీమ్స్ తయారు చేయరు కాబట్టి, ఐస్ క్రీమ్ ని ప్రమోట్ చేయడం మీ సిద్ధాంతాన్ని బ్రేక్ చేయడమే కదా అని ఎద్దేవా చేశాడు.
నెటిజెన్ కౌంటర్ కి రష్మీ వివరణ ఇచ్చారు. అవును గతంలో నేను తెలియక ఇలాంటి తప్పులు చేశాను. పాలను తాగడం మాత్రం చాలా కాలం క్రితమే బ్యాన్ చేశాను. నా ఉద్యమంలో భాగంగా కాకపోయినా నా శరీరం మీద పాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని మానేశాను. వీగన్ గా మారాక, పాల ఉత్పత్తులు తినడం లేదు. పాడి పరిశ్రమలో జరిగే దారుణమైన హింసను కళ్లారా చూశాకా నేను డైరీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం లేదు.. అని వివరణ ఇచ్చారు. తెలియక గతంలో తప్పులు చేసినా ఇప్పుడు ఆ పొరపాట్లు చేయడం లేదని ఒప్పుకున్నారు.
Rashmi Gautam
ఇటీవల హైదరాబాద్ లో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి. ఈ సంఘటన రష్మీ గౌతమ్ కి తలనొప్పులు తెచ్చిపెట్టింది. వీధి కుక్కలను సప్పోర్ట్ చేసే రష్మీ గౌతమ్ లాంటి వాళ్ళను జనాలు టార్గెట్ చేస్తున్నారు. రష్మీ గౌతమ్ వంటి యానిమల్ లవర్స్ వీధి కుక్కలను నియంత్రించకుండా అధికారులను అడ్డుకుంటున్నారు. వాటికి ఆహారం పెట్టి పోషించి వృద్ధి చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. బాలుడు కుక్కల దాడి సంఘటన జరిగిన నాటి నుండి రష్మీ గౌతమ్ పై సోషల్ మీడియా దాడి ఎక్కువైంది.
And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up
But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2— rashmi gautam (@rashmigautam27) March 2, 2023
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: The netizen who revealed rashmis mistake with the evidence star anchor who admitted that he made a mistake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com