Minister Balineni: ఏపీలో అధికార వైసీపీ పార్టీ గుండా రాజకీయాలు చేస్తోందని టీడీపీ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది. అయితే, అలాంటిది ఏమీ లేదు మేము ప్రజలకు మంచి పాలన అందిస్తున్నామని ఓ వైపు అధికార పార్టీ నేతలు జబ్బలు చరుచుకుంటుంటారు. ఆలోపే వైసీపీ నేతలు కర్రలు, ఆయుధాలు పట్టుకుని సీఎం జగన్ లేదా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి ఇంటిపై దాడులకు తెగబడుతుంటారు. ఎందుకంటే వైసీపీ పార్టీ నేతలకు మంచి చెప్పినా.. తమ ప్రియతమ నాయకుడిని విమర్శించినా ఎక్కడలేని పౌరుషం వస్తుంది. వెనకా ముందు ఆలోచించరు. తాము ఏది చేసినా మా నాయకుడు ఉన్నాడు. వాళ్లు చూసుకుంటారులే అన్న ధీమానే ఏపీని మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాల వైపు తీసుకెళ్తోంది.
ప్రకాశం జిల్లాలో తాజాగా సొంత పార్టీనేత, మంత్రి బాలినేని అనుచరుడు ‘సుబ్బారావు గుప్తా’ ఇంటిపై వైసీపీ నేతలు దాడికి దిగారు. తమ పార్టీ నాయకులనే విమర్శించే స్థాయికి ఎదిగావా అంటూ ఇంట్లోకి వచ్చి ఫర్నిచర్, బైకు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. అసలు వైసీపీ నేతలు ఎందుకు రెచ్చిపోయారు. ఏకంగా మంత్రి అనుచరుడిపైనే దాడికి దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం..
Also Read: ఏపీకి ఊహించని రిప్లై ఇచ్చిన నీతి అయోగ్..
మంత్రి బాలినేని పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలో అనుచరుడు సుబ్బారావు గుప్తా పాల్గొన్నారు. తమ ప్రియతమ నేత, బాలినేని చాలా కాలం మంత్రి పదవిలో ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే, వైసీపీ పార్టీకి జరుగుతున్న నష్టంపై పలు కామెంట్లు చేశారు. అంబటి రాంబాబు, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ వంటి వాళ్లు చేస్తున్న కామెంట్స్ వలన పార్టీకి భవిష్యత్తులో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వైసీపీకి ఇరవై శాతం ఓట్లు తగ్గిపోతాయని.. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ లీడర్లను కర్రలు వెంటపట్టుకుని పరిగెత్తిస్తారని సంచలన కామెంట్స్ చేశారు. అయితే, వీటిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఊగిపోయారు. వెంటనే అతని ఇంటి పైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. అతను చెప్పింది వాస్తవమే అని అంగీకరించే సహనం, ఆలోచన వైసీపీ నేతలకు లేదని కొందరు విమర్శిస్తున్నారు.
Also Read: సినిమా టికెట్ల వివాదం.. జగన్ పంతమా? సినీ ఇండస్ట్రీ పట్టుదలా నెగ్గుతుందా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Ycp leaders attack minister balineni
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com