YCP- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. 2024లో వైసీపీ ముక్త ఆంధ్రద్రేశ్ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. అడ్డుకునేందుకు అధికార వైసీపీ దొడ్డిదారులు వెతుకుతోంది. జనసేనానిపై వ్యక్తిగత ధూషణలు చేయడం, ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడడం ద్వారా పవన్ సహనం కోల్పోయేలా చేస్తున్నారు. వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మాటలను ముందే గమనించిన జనసేనాని అధికార పార్టీకి ఇటీవలే చురకలు అంటించారు. తనను తిట్టేందుకు ఓ శాఖను కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. అయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. పవన్‌ను వీలైనంత రెచ్చగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పవన్‌ను దూషించకుండా అధికార వైసీపీ నేతలకు రోజు గడవడం లేదంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రా ప్రజలు అసహ్యించుకునేలా అధికార పార్టీనేతలు రాజకీయం చేస్తున్నారు.
పవన్‌ను ప్రజలకు దూరం చేయడమే లక్ష్యంగా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రత్యేక వాహనం కూడా తయారు చేయించుకుని వారాహి అని పేరు పెట్టారు. ఇటీవలే దానికి కొండగట్టులో పూజలు చేయించారు. త్వరలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం అన్నట్లుగా వేగంగా ప్రజలకు చేరువవుతున్నారు. దీనిని గమనించిన అధికార వైసీపీ నేతలు పవన్‌ను ప్రజలకు దూరం చేయాలని కుటిల ప్రతయ్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా..
ఒకవైపు ప్రజాసమస్యలపై ఉద్యమిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి దగ్గరయ్యారు. రాజకీయాల్లో పొత్తులు సహజం. పొత్తులపై ఇతర పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తే చేయవచ్చు కానీ.. పొత్తు పెట్టుకుంటున్నారని ఇలా వ్యక్తిగత హననానికి దిగడం వైసీపీకే చెల్లింది. రాజకీయాల్లో ఇది కొత్త ధోరణే. రిపబ్లిక్ డే రోజు పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలను విమర్శించారని మళ్లీ అదే పని చేశారు. పవన్ విధానాల పరంగా ప్రశ్నిస్తే.. వారు కూడా ఆ పద్దతిలోనే స్పందించవచ్చు. కానీ వైసీపీ నేతలు అలా చేయడం లేదు. దారుణ వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ఫ్రస్ట్రేషన్ అయ్యేలా చేస్తున్నారు. దీంతో పవన్ కూడా తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వారిని అదే తరహాలో విమర్శిస్తున్నారు.
పవన్‌పైనే సానుభూతి..
అధికార పార్టీ నేతలు చేస్తున్న దారుణ వ్యాఖ్యలు, వాటికి దీటుగా పవన్ ఇస్తున్న సమాధానంతో ఏపీలో పవన్‌కే ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది. అయితే ఈ విషయం వైఎస్ఆర్సీపీకి తెలియదా అంటే తెలియదని.. అంచనా వేయలేం. అయినా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారంటే అందుకు కారణం.. పవన్‌ను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబుకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కలిస్తే తమ అధికారానికి ఇబ్బంది ఎదురవుతుందని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే పవన్‌ను వీలైనంత ఎక్కువగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఒంటరిని చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఒంటిగా పోటీ చేయించాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని వైసీపీకి లాభం కలుగుతుందని భావిస్తున్నారు. అందుకే పవన్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తెచ్చేలా..
అధికార పార్టీ పవన్‌ను టార్గెట్ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను బలవంతుడిగా చూపించడం ద్వారా తనకు క్రేజ్ పెరిగిందని, పార్టీకి ఆదరణ పెరిగిందని జనసేన అనుకుంటే టీడీపీని ఎక్కువ సీట్లకు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు రెండు పార్టీల మధ్య తేడాలొస్తాయి. చివరికి పొత్తులు పెట్టుకున్నా ఓట్ల బదిలీ సాఫీగా సాగదని ప్లాన్ వేస్తున్నట్లు పొలిటికల్ టాక్. మొత్తంగా వైసీపీ రాజకీయం.. పవన్‌ను ప్రజలకు దూరం చేయడంతోపాటు, టీడీపీ జనసేన కలువకుండా చూడడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఉంటున్న వైసీపీ ప్లాన్‌ను పసిగట్టకపోతే అధికార పార్టీ ఆశించిన లబ్ధి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ycp is provoking pawan kalyan what is the original sketch behind this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com