Zelensky Meet Trump: మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మెట్టు దిగి… రెండు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌తో భేటీ అయ్యారు. అలస్కాలో జరిగిన ఈ సమావేశం సక్సెస్ అయిందని ఇద్దరూ ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్సీ్కతో చర్చించిన తర్వాత ఒప్పందం చేసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం(ఆగస్టు 18న) న్యూయార్క్‌లోని వైట్‌హౌస్‌లో ట్రంప్–జెలెన్సీ్క భేటీ జరిగింది. ఈ భేటీకి ఐరోపా, నాటో నేతలు పెద్ద ఎత్తున హాజరై, శాంతి చర్చలకు బలమైన మద్దతు అందించారు.
Also Read: ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష కోసం వచ్చిన 45 మందిలో సెలెక్ట్ అయిన 15 మంది వీళ్ళే…
త్రైపాక్షిక చర్చల అవసరం..
ట్రంప్, జెలెన్సీ్కతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రష్యాతో త్రైపాక్షిక సమావేశం నిర్వహించాల్సిన అవసరాన్ని ఒప్పించారు. ‘‘ఈ భేటీ సవ్యంగా జరిగితే, యుద్ధాన్ని ముగించేందుకు సానుకూల అవకాశాలు ఉన్నాయి,’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యాతో చర్చల ద్వారా శాంతి స్థాపన సాధ్యమని, అందుకు ఉక్రెయిన్ సహకారం కీలకమని సూచించారు. జెలెన్సీ్క, ట్రంప్ శాంతి ప్రయత్నాలను సమర్థిస్తూ, రష్యాతో త్రైపాక్షిక చర్చలకు సిద్ధమని తెలిపారు.
ఐరోపా నేతల సమన్వయం
ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, నాటో కార్యదర్శి మార్క్ రుట్టె హాజరయ్యారు. ఈ నేతల సమక్షంలో జరిగిన చర్చలు ఉక్రెయిన్‌కు ఐరోపా దేశాల సంఘీభావాన్ని సూచిస్తాయి. ఫిబ్రవరి 2025లో జెలెన్సీ్క–ట్రంప్ భేటీలో ఉద్భవించిన వివాదాల నేపథ్యంలో, ఈసారి ఐరోపా నేతల సమక్షంలో చర్చలు జరపడం గమనార్హం.
ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు
ఈ సమావేశం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సైరన్లు మోగడం, రష్యా దాడులు కొనసాగడం యుద్ధ తీవ్రతను సూచిస్తోంది. జెలెన్సీ్క, రష్యా దాడులను ఖండిస్తూ, శాంతి కోసం బలమైన ఒత్తిడి అవసరమని, ట్రంప్ ఆ బలాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. శాంతి చర్చలు విజయవంతం కావాలంటే అమెరికా, ఐరోపా సమన్వయం కీలకమని స్పష్టం చేశారు.
అలాస్కాలో పుతిన్‌తో ట్రంప్ భేటీలో ఉక్రెయిన్‌కు నాటో–శైలి భద్రతా హామీలపై అంగీకారం కుదిరినట్లు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. అయితే, డొనెట్స్క్, లుహాన్సక్ ప్రాంతాలను రష్యాకు అప్పగించాలనే పుతిన్ డిమాండ్‌ను జెలెన్సీ్క తిరస్కరించారు. శాంతి ఒప్పందంలో భూభాగాలను వదులుకోవడం ఉక్రెయిన్ రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. త్రైపాక్షిక శాంతి చర్చలకు ఇదే అడ్డంకిగా మారే అవకాశం ఉంది.