World Diabetes Day 2024:ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య బారిన పడకుండా దీని గురించి అవగాహన కల్పించాలని ప్రతీ ఏడాది నవంబర్ 14న ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వ్యాధి వల్ల ఎందరో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరగడంతో మధుమేహంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మధుమేహం అనేది పంచదార, స్వీట్లు అధికంగా తింటే ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈ సమస్య ఎక్కువ అయ్యి టైప్ 1 డయాబెటిస్ , టైప్ 2 డయాబెటిస్‌కి కూడా దారితీస్తుంది. మధుమేహం వల్ల హృదయ సంబంధ సమస్యలు, నరాల దెబ్బతినడం, మూత్రపిండాలు దెబ్బతినడం, పాదాలకు నష్టం, చర్మ వ్యాధులు, అంగస్తంభన, నిరాశ, దంత సమస్యలు వంటి ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీయవచ్చు.
ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవం థీమ్
మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఇది వచ్చిన కూడా పెద్దగా తెలియదు. కానీ వస్తే మాత్రం ఇంకా కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడి చాలా మంది ఇప్పటి వరకు మరణించారు. ఇకపై మరణించకూడదని ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని అడ్డంకెలను ఛేదించి, అంతరాలను తగ్గించాలనే థీమ్‌తో జరుపుకుంటున్నారు. మధుమేహం ఉన్నవారు శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకుంటున్నారు. 2030కి మధుమేహాన్ని ఎలా అయిన అంతరించి పోయేలా చేయాలని ప్రతీ ఏడాది కొత్త థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే చార్లెస్ బెస్ట్‌తో పాటు ఇన్సులిన్ సహా ఆవిష్కర్త సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజు జ్ఞాపకార్థంగా నవంబర్ 14వ తేదీన ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్‌తో 1991లో ఈ ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ 2006లో అధికారికంగా ఐక్యరాజ్యసమితి పర్మిషన్ ఇచ్చింది. ఈ రోజు బ్లూ సర్కిల్ లోగోతో ప్రచారాలు చేసి మధుమేహం గురించి అవగాహన కల్పిస్తారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మధుమేహం ఉన్నవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అయ్యి కొన్నిసార్లు మరణం సంభవించవచ్చు. మధుమేహం ఉన్నవారు చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఏ పదార్థం తిన్నా ఆలోచించి తినాలి. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఎక్కువగా తృణధాన్యాలు, చపాతీ, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. స్వీట్లు, పంచదార వంటివి అసలు తీసుకోకూడదు. ఏ పదార్థం తిన్న కూడా తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. టేస్టీ చాక్లెట్లు, కుకీలు, బిస్కెట్లు, ఆర్టిఫిషియల్ స్వీటెనర్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.