Sheikh Hasina: ఆసియాలో సంక్షోభంలో ఉన్న దేశాల జాబితాలో బంగ్లాదేశ్ చేరిందని అందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం తీసుకువచ్చిన షేక్ ముజిబుర్ రహెమాన్ కు చెందిన అవామీ లీగ్ పార్టీకి కొన్నేళ్లుగా ఆ దేశాన్ని పాలిస్తూ వచ్చింది. ఆయన కూతురైన షేక్ హాసీనా నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధాని పీఠంపై కూర్చున్నారు. రిజర్వేషన్ల విషయంలో దేశ వ్యాప్తంగా చెలరేగిన దుమారం ఆమె ప్రభుత్వం పడిపోవడంతో పాటు ఆమె దేశం విడిచి పారిపోయేలా చేసింది. ప్రాణాపాయంతో ఆమె భారత్ లోకి వచ్చింది. దీంతో ఆమెకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇక బంగ్లాదేశ్ లో యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఈ ప్రభుత్వం షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను కోరుతోంది. అయితే భారత్ మాత్రం ఎలాంటి జవాబు చెప్పడం లేదు. వారి దేశానికి చెందిన ఆమెను వారికి అప్పగించడంలో భారత్ ప్రమేయం ఏంటి? అసలు ఆమెను అప్పగించడం భారత్ కు లాభమా..? నష్టమా..? ఎందుకు సమాధానం కూడా ఇవ్వకుండా ఆలోచిస్తున్నాం అంటూ మౌనంగా ఉంటూ దాట వేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎన్నేళ్లు దాట వేస్తుందని చాలా మందికి అనుమానాలు కలుగుతున్నాయి. దీని గురించి తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ లో అంతర్యుద్ధం గురించి ప్రపంచానికి ఓపెన్ సీక్రెట్. ఎందుకు అంతర్యుద్ధం మొదలైంది..? ఏ ప్రయోజనం చేకూరింది..? బంగ్లాను బలిపశువును చేసింది దేశం ఏంటి అని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బంగ్లాలో అంత్యర్యుద్ధానికి కారణం అమెరికా డీప్ స్టేట్. డీప్ స్టేట్ కు వ్యతిరేకంగా ఉన్న షేక్ హసీనాను గద్దె దించి ఆమె స్థానంలో తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తి యూనిస్ ను గద్దెనెక్కిస్తే పట్టు సంపాదించుకోవచ్చని భావించి అంతర్యుద్ధా్నికి కారణమైంది.
హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతోంది. హాసీనాను అప్పగించాలన్న బంగ్లా కోరికను భారత్ పెద్దగా పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్, భారత్ కు కొన్ని ఒప్పందాలు జరిగాయి. అందులో ఒక దేశానికి చెందిన మిలిటెంట్లు, నేరస్తులు మరో దేశంలో ఉంటే అప్పగించాలి. ఈ షరతు ఇక్కడ వర్తించదు. ఈ ఒప్పందంలోనే మరో నిబంధన కూడా ఉంది. ఇరు దేశాలకు చెందిన రాజకీయ నాయకులను అప్పగించాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాల్లో ఏవైనా ఆరోపణలు ఎదుర్కొంటూ మరో దేశంలో ఆశ్రయం పొందితే అప్పగించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన ఇక్కడ వర్తిస్తుంది.
అయితే, ఇక్కడ భారత్ ప్రతిష్ట కూడా ముఖ్యమే. ఒక వేళ షేక్ హసీనాను భారత్ అప్పగిస్తే ప్రతిష్ట దెబ్బతింటుంది. భారత్ అతి చిన్న దేశానికి కూడా భయపడుతుందని అంతర్జాతీయ సమాజానికి ఒక మెసేజ్ పోతుంది. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. దీనికి తోడు బంగ్లాదేశ్ లో ఏర్పడింది ప్రజా ప్రభుత్వం కాదు. కాబట్టి అప్పగించాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ లో మళ్లీ ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం కోరిన దానిపై భారత్ కొంత తగ్గవచ్చు. కానీ, నియంతృత్వ ప్రభుత్వానికి అప్పగించాల్సిన అవసరం లేదు.
పైగా ఇప్పటి వరకు బంగ్లాదేశ్ భారత్ మిత్రదేశంగానే కొనసాగుతూ వస్తోంది. షేక్ హసీనా తండ్రి పాక్ కు వ్యతిరేకంగా పోరాడి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం సంపాదించి పెట్టాడు. అప్పటి నుంచి భారత్ కు బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంటూ వస్తుంది. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాలో చోటు లేదని హసీనా ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న మోడీ ప్రభుత్వం షేక్ హసీనా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తుంది.
డీప్ స్టేట్ కు బలైన వ్యక్తుల్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత డీప్ స్టేట్ పై చాలా ఆంక్షలు తీసుకువస్తారని అంతర్జాతీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయితే బంగ్లాలో పరిస్థితులు కొంత మెరుగవ్వచ్చు. ఆ తర్వాత పంపించవచ్చని తెలుస్తోంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Will india hand over sheikh hasina to bangladesh what comes under non handover
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com