Prayagraj Kumbh Mela 2025: ప్రతీ హిందువుకు కుంభ మేళా అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. ప్రయాగ్ రాజ్ లో జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. 2025, జనవరి 13 వ తేదీ నుంచి ఈ కుంభ మేళా ప్రారంభం కానుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆరు రాజ స్నానాలు జరుగుతాయి. మొదటి రోజు రాజ స్నానంతో కుంభ మేళా ప్రారంభం అవుతుంది. మిగిలిన రాజ స్నానలలో ఒకటి మాఘ మాసంలో పౌర్ణమి రోజున చేయాలి. ఇది ఆరు రాజ స్నానల్లో ఒకటి. కుంభమేళాలోని రాజ స్నానాల్లో ఐదో రాజ స్నానం ఎప్పుడు చేయాలి? శుభ సమయం ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. వచ్చే సంవత్సరం ప్రయాగ్ రాజ్‌లో హిందువుల అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహా కుంభ మేళా జరగనుంది. 13 నుంచి త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్ రాజ్‌లో ఇది ప్రారంభం అవుతుంది. ఈ మహా కుంభ మేళాలో చేసే రాజస్నానానికి ప్రాముఖ్యత ఉంది. ఇందులో మొత్తం 6 రాజ స్నానాలు చేస్తారు. జనవరి 13న పుష్య మాసం పౌర్ణమి రోజున ప్రారంభమై మహాశివరాత్రితో ఇవి ముగుస్తాయి. ఈ 6 రాజ స్నానాల్లో ఒకటి మాఘ పౌర్ణమి నాడు చేస్తారు. ఈ రాచ స్నానం ఏ తేదీన వచ్చిందో.. స్నానం చేసేందుకు శుభ సమయం.. హిందూ మతంలో మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత తెలుసుకుందాం.
మాఘ పౌర్ణమి రాజ స్నానం ఎప్పుడు చేయాలి..?
మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. మహా కుంభ మేళ జరుగుతున్న సమయంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12వ తేదీ వచ్చింది. సాయంత్రం 5 గంటల 19 నిమిషాల బ్రహ్మ ముహూర్తం ప్రారంభమై 6 గంటల 10 నిమిషాల ముహూర్తంతో ముగుస్తుంది. ఈ సమయంలో స్నానం చేయడం సాధారణ రోజుల్లో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
మాఘ పౌర్ణమి విశిష్టత
హిందూ మత విశ్వాసం ప్రకారం.. మాఘ పౌర్ణమి రోజున దేవతలు భూమిపైకి వస్తారట, మానవ రూపంలో భూమిపై సంచరిస్తుంటారట. మాఘ పౌర్ణమి రోజు మానవ రూపం సంతరించుకున్న దేవతలు త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి ఆ తర్వాత ధ్యానం చేస్తారని నమ్మకం. వారు స్నానం చేసిన రోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం. ఈ రోజు నదిని పూజించిన వారి కోరికలు కూడా నెరవేరుతాయి.
మహా విష్ణువు అనుగ్రహం
హిందువుల విశ్వాసం ప్రకారం.. మాఘ పౌర్ణమి రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి దానం చేసే వారిపై శ్రీ హరి చూపు తమపై ఉంటుంది. ఈ రోజు స్నానం చేసిన వారికి మహా విష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడని బలంగా నమ్ముతారు. పూర్వీకుల అనుగ్రహం కోసం శ్రద్ధ కర్మలను కూడా చేస్తారు. ఈ రోజు పేదలకు, ఆకలి అన్నవారికి దానం చేస్తే మరింత కలిసి వస్తుంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: When to take bath in prayagraj kumbh mela 2025 when do donation will bring good luck
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com