Taiwan: పెళ్లి.. పేరుకు రెండు అక్షరాలు మాత్రమే.. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. కుటుంబం అనే వ్యవస్థకు దారులు పరుస్తుంది. ఈ పెళ్లి అనే పదం ద్వారా ఏర్పడే వైవాహిక బంధం కలకాలం వర్ధిల్లాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకానికి బీటలు వాడితే మాత్రం వైవాహిక బంధం సర్వనాశనం అవుతుంది. ప్రస్తుత తరుణంలో వైవాహిక బంధాలలో వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయి. భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య ఇతర వ్యవహారాలు సాగించడంతో అవి అంతిమంగా కుటుంబాల మీద ప్రభావం చూపిస్తున్నాయి. తైవాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి కి పెళ్లయింది. అతని భార్య బాగానే ఉంది. వారి వైవాహిక జీవితం కూడా సరదాగా సాగిపోయింది. ఇందులోనే అతడిలో కలిగిన ఓ అనుమానం సంచలనానికి దారి తీసింది.
తైవాన్ దేశానికి చెందిన ఫాన్ అనే వ్యక్తి కి తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోందని అనుమానం ఉండేది. అయితే ఆ వ్యవహారాన్ని ఎలాగైనా బయటపెట్టాలని అతడు ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. వాటిని రాసి ప్రాంతాల్లో ఏర్పాటు చేశాడు దీంతో అక్కడి కోర్టు అక్కడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఫాన్, అతని భార్య మధ్య 2022 నుంచి గొడవలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇదే సమయంలో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తను నివాసముండే ఇంట్లో వాళ్ళు ప్రాంతాలలో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాడు. రెండు వారాల అనంతరం అతడి అనుమానం నిజం అని తేలింది. అతని భార్య మరొక వ్యక్తితో ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలు ఆ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇదే సమయంలో ఆ దృశ్యాలను అతని భార్యకు చూపించి.. తనకు విడాకులు కావాలని అతడు కోర్టుకు ఎక్కాడు. ఇదే సమయంలో అతని భార్య తన ఏకాంతానికి భంగం కలిగించాడని, తన అనుమతి లేకుండా ఇంట్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశాడని కోర్టులో కేసు పెట్టింది. దీంతో కోర్టు న్యాయమూర్తి ఫాన్ ను మందలించాడు. ఇతరుల ప్రైవేట్ కార్యకర్తలను చిత్రీకరించడం నేరమని మందలిస్తూ.. అతనికి మూడు నెలల పాటు జైలు శిక్ష విధించాడు. ప్రస్తుతం ఫాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఫాన్ కు శిక్ష ఖరారు కావడంతో.. అతడి స్నేహితులు కోర్టు తీరును తప్ప పడుతున్నారు. అటు వైవాహిక జీవితాన్ని నష్టపోయిన ఫాన్.. చివరికి జైలు పాలు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి తీర్పు ఇచ్చే సమయంలో కోర్టు ఆలోచించి ఉంటే బాగుండేదని హితవు పలుకుతున్నారు.